News March 24, 2024
గేట్లు తెరవాల్సింది రైతుల కోసం: హరీశ్

TG: కాంగ్రెస్ ప్రభుత్వంపై BRS MLA హరీశ్‌రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. CM గేట్లు తెరవాల్సింది నేతల కోసం కాదని, రైతుల కోసమని సూచించారు. నీళ్లు లేక పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.25వేల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. నేతలను పార్టీలో చేర్చుకునేందుకు వారి ఇళ్లకు వెళుతున్న CM రైతుల ఇళ్లకు మాత్రం వెళ్లడం లేదన్నారు. కాంగ్రెస్ పాలనలో 100రోజుల్లో 180మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు.
Similar News
News July 11, 2025
ఇలా చేస్తే మీ ఆధార్ వివరాలు సేఫ్: UIDAI

ఆధార్ సమాచారం దుర్వినియోగం కాకుండా కాపాడుకునేందుకు బయోమెట్రిక్ లాక్ చేసుకోవాలని UIDAI పేర్కొంది. దీనికోసం <
News July 11, 2025
జగన్ పర్యటన.. మొత్తం నాలుగు కేసులు నమోదు

AP: YS జగన్ చిత్తూరు(D) బంగారుపాళ్యం పర్యటనపై తాజాగా మరో కేసు నమోదైంది. అనుమతి లేకున్నా రోడ్‌షో చేపట్టారని పోలీసులు కేసు నమోదు చేశారు. పరిమితికి మించి జన సమీకరణ చేపట్టారని, రోడ్డుపై మామిడికాయలు పారబోసి షరతులు ఉల్లంఘించారని, ఫొటోగ్రాఫర్‌పై జరిగిన దాడి ఘటనపై 3 వేర్వేరు కేసులు పెట్టారు. CC ఫుటేజ్, వీడియోలను పరిశీలిస్తున్న పోలీసులు మరికొందరిపై కేసులు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
News July 11, 2025
ఫీజులు పెంచాలన్న అభ్యర్థనను తిరస్కరించిన HC

TG: ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలకు హైకోర్టులో చుక్కెదురైంది. ఫీజులు పెంచాలన్న పలు కాలేజీల అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆరు వారాల్లోగా ఫీజులు నిర్ణయించాలని ఫీజుల నియంత్రణ కమిటీని ఆదేశించింది. కమిటీ నిర్ణయంపైనే ఫీజుల పెంపు ఆధారపడి ఉంటుందని కాలేజీలకు న్యాయస్థానం స్పష్టం చేసింది.