News March 10, 2025
పంత్‌ను కాదని KL వైపు గౌతీ మొగ్గు.. ఎందుకంటే!

CT 2025లో రిషభ్ పంత్‌ను కాదని KL రాహుల్‌ను కోచ్ గౌతమ్ గంభీర్ ఎంచుకోవడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు వన్డేల్లో పంత్ తన X ఫ్యాక్టర్ నిరూపించుకోలేదు. స్పిన్ పిచ్‌లపై అంతగా ప్రభావం చూపలేదు. పైగా దుబాయ్ వంటి పిచ్‌లపై బౌలర్లు పెట్టే పరీక్ష ఎదుర్కోవాలంటే ఓపిక, మెరుగైన షాట్ సెలక్షన్, పరిణతి అవసరం. అతడిది ఇంపల్సివ్ నేచర్. తన వికెట్ విలువ తెలుసుకోకుండా ఔటైపోతారు. అందుకే KLవైపు గౌతీ మొగ్గారు.
Similar News
News March 10, 2025
ఆస్ట్రేలియా వద్దే అత్యధిక ట్రోఫీలు!

ఛాంపియన్స్ ట్రోఫీని టీమ్ఇండియా గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ విజయంతో ఇండియా ఖాతాలో 7 ICC ట్రోఫీలు నమోదయ్యాయి. ఇందులో 2 వన్డే వరల్డ్ కప్స్, 2 టీ20 వరల్డ్ కప్స్‌తో పాటు 3 ఛాంపియన్స్ ట్రోఫీలు ఉన్నాయి. అయితే, అత్యధిక ట్రోఫీలు మాత్రం ఆస్ట్రేలియా వద్దే ఉండటం గమనార్హం. AUS ఏకంగా 10 ICC ట్రోఫీలు గెలుచుకుంది. ఇండియా తర్వాత వెస్టిండీస్ వద్ద 5, శ్రీలంక, పాకిస్థాన్, ఇంగ్లండ్ వద్ద చెరో మూడు ట్రోఫీలున్నాయి.
News March 10, 2025
తెలంగాణ భక్తులకు నిరాశ

తిరుమలలో తెలంగాణ భక్తులకు మళ్లీ నిరాశే ఎదురైంది. మంత్రులు, ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్దామనుకున్న వారి లేఖలను టీటీడీ స్వీకరించడం లేదు. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా ఇలా చేయడం ఏంటని భక్తులు మండిపడుతున్నారు. కేవలం తెలంగాణకు చెందిన ప్రజాప్రతినిధుల లేఖలే తీసుకోవడం లేదని భక్తులు ఆరోపిస్తున్నారు. దీనిపై టీటీడీ ఇంకా స్పందించలేదు.
News March 10, 2025
‘మండే’పోయిన Stock Markets

స్టాక్‌మార్కెట్లు భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ 74115 (-217), నిఫ్టీ 22460 (-92) వద్ద ముగిశాయి. అనిశ్చితి, ట్రంప్ టారిఫ్స్, US షట్‌డౌన్ అంశాలు సూచీలను పడేశాయి. FMCG షేర్లు ఎగిశాయి. రియాల్టి, PSUబ్యాంకు, O&G, వినియోగం, ఎనర్జీ, ఆటో, తయారీ, మెటల్, హెల్త్‌కేర్, ఫార్మా, బ్యాంకు షేర్లు ఎరుపెక్కాయి. పవర్‌గ్రిడ్, HUL, ఇన్ఫీ, SBI లైఫ్, నెస్లే, ఏషియన్ పెయింట్స్ టాప్ గెయినర్స్. ONGC, ట్రెంట్ టాప్ లూజర్స్.