News December 5, 2024

హేజిల్‌వుడ్‌పై గవాస్కర్‌ వ్యాఖ్యలు.. హెడ్, ఫించ్ అసహనం

image

ఆస్ట్రేలియా జట్టులో విభేదాల వల్లే జోష్ హేజిల్‌వుడ్‌ను గాయం వంకతో పక్కన పెట్టారన్న గవాస్కర్ వ్యాఖ్యలపై ఆస్ట్రేలియా ఆటగాడు హెడ్, మాజీ ఆటగాడు ఫించ్ అసహనం వ్యక్తం చేశారు. ‘సన్నీ వ్యాఖ్యలు ఆశ్చర్యపరిచాయి. అయినా పట్టించుకోనక్కర్లేదు. అభిప్రాయం చెప్పేందుకు ఆయనకు డబ్బులు ముడుతున్నాయి’ అని హెడ్ అన్నారు. ‘సన్నీ గాలిమాటలు మాట్లాడుతున్నారు. కామెంటరీ సమయంలో ఆయన ప్రవర్తన ఇలా లేదు’ అని ఫించ్ వ్యాఖ్యానించారు.

Similar News

News March 5, 2026

భావిభారత పౌరులు.. ఊబకాయులు!

image

ప్రాసెస్డ్ ఫుడ్, కూల్‌డ్రింక్స్ తదితర ఆహార అలవాట్లు దేశ భవిష్యత్తు అయిన బాలలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. INDలో 11-17ఏళ్ల మధ్య పిల్లల్లో ఊబకాయం పెరిగి USను దాటి 2వ స్థానానికి చేరినట్లు ఒబెసిటీ అట్లాస్-2026 పేర్కొంది. 5-9 వయసు వారిలో 1.49కోట్లు, 10-19 ఏళ్ల వారిలో 2.6కోట్ల మంది అధిక బరువుతో ఉన్నట్లు చెప్పింది. 74% పిల్లలు శారీరక శ్రమ లేకే బరువు పెరుగుతున్నారు. అటు చైనా తొలిస్థానంలో ఉంది.

News March 5, 2026

సెమీస్‌లో టీమ్‌గా రాణిస్తారా?

image

T20WC: ఈరోజు ఇంగ్లండ్‌తో సెమీస్‌లో భారత్ వన్ మ్యాన్ షోలపై ఆధారపడకుండా జట్టుగా రాణించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఇప్పటివరకు దాదాపు అన్ని మ్యాచుల్లో ఎవరో ఒకరు రాణిస్తూ జట్టును ఆదుకుంటున్నారు. ఈసారి భారత్ ఆ తప్పు చేయొద్దంటున్నారు. వాంఖడేలో షార్ట్ బౌండరీస్‌ను అడ్వాంటేజ్‌గా తీసుకొని బ్యాటర్లు సమష్టిగా రాణించాలని.. బౌలింగ్, ఫీల్డింగ్‌లోనూ తడబడకూడదని కోరుకుంటున్నారు.

News March 5, 2026

రేపటి నుంచి భగభగలు!

image

తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఎండలు తీవ్రరూపం దాల్చనున్నాయి. కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో టెంపరేచర్ 38°C దాటుతుందని వాతావరణశాఖ హెచ్చరించింది. నిన్న కర్నూలులో అత్యధికంగా 38.5°C నమోదైంది. అటు తెలంగాణలోని ములుగు, భూపాలపల్లి, భద్రాద్రి, సూర్యాపేట, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో 40+డిగ్రీల టెంపరేచర్ నమోదవుతుందని HYD వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ జిల్లాలకు ఆరెంజ్, మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది.