News March 26, 2024
గాజాలో కాల్పుల విరమణ పాటించాల్సిందే: UNSC

రంజాన్ నెల సందర్భంగా ఇజ్రాయెల్ వెంటనే గాజాపై కాల్పుల్ని ఆపాలని ఐక్యరాజ్యసమితి భద్రతామండలి డిమాండ్ చేసింది. ఇజ్రాయెల్ బందీలందర్నీ విడిచిపెట్టాలని హమాస్‌కు తేల్చిచెప్పింది. గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం తర్వాత UNSC స్పందించడం ఇదే ప్రథమం. మండలిలో 15 సభ్యదేశాల్లో అమెరికా తప్ప మిగిలిన అన్ని దేశాలూ తీర్మానానికి అనుకూలంగా ఓటేశాయి. వీటో అధికారంతో తీర్మానాన్ని అడ్డుకునే ఛాన్స్ ఉన్నా అమెరికా దూరం పాటించింది.
Similar News
News September 15, 2025
వనపర్తి: మూడు వైద్య అధికారి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

వనపర్తి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో మూడు వైద్య అధికారి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి శ్రీనివాసులు ఈ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల 19వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. దరఖాస్తుతో పాటు జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ.500, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.300 చొప్పున జిల్లా వైద్య, ఆరోగ్య కార్యాలయం, వనపర్తి పేరు మీద డీడీ తీసి జత చేయాలని ఆయన సూచించారు.
News September 15, 2025
రేపు భారత్-అమెరికా వాణిజ్య చర్చలు

భారత్, అమెరికా మధ్య రేపు వాణిజ్య చర్చలు జరగనున్నాయి. ఇందుకోసం ఇవాళ రాత్రి US చీఫ్ నెగోషియేటర్, ట్రంప్ సహాయకుడు బ్రెండన్ లించ్ భారత్ చేరుకోనున్నారు. ట్రేడ్ డీల్‌పై పరస్పరం చర్చలకు ఎదురుచూస్తున్నట్లు ట్రంప్‌తో పాటు ప్రధాని మోదీ ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే.
News September 15, 2025
మానసిక సమస్యలు రాకూడదంటే?

ప్రస్తుతం చాలా మంది మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారు. ఈ సమస్యల నివారణకు సహాయపడే కొన్ని ముఖ్యమైన అంశాలను మానసిక వైద్యుడు శ్రీకాంత్ పంచుకున్నారు. ‘ఆనందమైన బాల్యం, పేదరికం లేకపోవడం (ధనికులుగా ఉండటం కాదు), దీర్ఘకాలిక స్నేహం, వ్యాయామం, పెళ్లి, భక్తి/ దేవుని పట్ల నమ్మకం, సామాజిక సేవ, సైన్యం లేదా NCC వంటి వాటిలో చేరటం. సమతుల్య ఆహారం, పచ్చదనం, అభిరుచులు (హాబీస్)’ వంటివి ఉండాలని సూచించారు.