News January 4, 2025
ఇజ్రాయెల్‌పైకి గాజా రాకెట్ల దాడి

తమపై వైమానిక దాడులు చేసిన ఇజ్రాయెల్‌పైకి గాజా యంత్రాంగం రాకెట్లతో ప్రతిదాడి చేసింది. తమ భూభాగం లక్ష్యంగా గాజా వైపునుంచి 3 రాకెట్ల దూసుకొచ్చాయని ఇజ్రాయెల్ ఓ ప్రకటనలో తెలిపింది. ఇది కొనసాగితే తమ దాడుల తీవ్రతను మరింత పెంచుతామని హెచ్చరించింది. మరోవైపు ఇజ్రాయెల్ తాజా దాడులు 16మంది పాలస్తీనా పౌరుల్ని బలితీసుకున్నాయని గాజా యంత్రాంగం వెల్లడించింది.
Similar News
News January 21, 2026
మంచిర్యాలలో సర్పంచ్‌లకు శిక్షణ

ప్రతి ఒక్కరు తమ గ్రామాలను 100% అక్షరాస్యత సాధించేలా కృషి చేయాలని జిల్లా వయోజన విద్యాధికారి పురుషోత్తం అన్నారు. మంచిర్యాల జిల్లాలో జరుగుతున్న సర్పంచ్ల శిక్షణ కార్యక్రమంలో హాజరై ఉల్లాస్- అమ్మకు అక్షరమాల కార్యక్రమంపై సర్పంచులకు అవగాహన కల్పించారు. గ్రామాల్లో నిరక్షరాస్యులైన వయోజనులు ప్రతి ఒక్కరు చదువు నేర్చుకునేలా ప్రోత్సహించాలన్నారు. అమ్మకు అక్షరమాల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
News January 21, 2026
గుండెపోటుతో నటుడు మృతి

మలయాళ నటి ఊర్వశి సోదరుడు, నటుడు కమల్ రాయ్(54) కన్నుమూశారు. చెన్నైలో ఆయన గుండెపోటుతో మరణించారు. తమిళ్ సినిమా ‘పుతుస పడికిరెన్ పాటు’ సినిమాతో హీరోగా పరిచయమైన కమల్ 30 చిత్రాల్లో నటించారు. ఇందులో సాయుజ్యం, మంజు, కింగిని, వచలమ్, శోభనం, ది కింగ్ మేకర్, లీడర్ తదితర సినిమాలున్నాయి. ఆయన సోదరి ఊర్వశి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు. ఆమె తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళంలో మొత్తం 350 చిత్రాల్లో నటించారు.
News January 21, 2026
ఆరావళి అక్రమ మైనింగ్.. కోలుకోలేని నష్టమన్న SC

ఆరావళి పర్వతాల్లో అక్రమ మైనింగ్‌పై రివ్యూ చేసేందుకు ఎక్స్పర్ట్ కమిటీని నియమిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. అక్రమ మైనింగ్ కోలుకోలేని నష్టాన్ని కలిగిస్తుందని వ్యాఖ్యానించింది. కమిటీ కోసం పర్యావరణవేత్తలు, శాస్త్రవేత్తల పేర్లను 4 వారాల్లోగా ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. నిపుణుల కమిటీ తమ పర్యవేక్షణలో పనిచేస్తుందని ధర్మాసనం స్పష్టం చేసింది. కొత్తగా మైనింగ్ లీజులను మంజూరు చేయడాన్ని నిషేధించింది.


