News January 26, 2025
యుద్ధంతో 60 ఏళ్ల వెనక్కి గాజా: యూఎన్

హమాస్, ఇజ్రాయెల్ యుద్ధం వల్ల గాజా 60 ఏళ్ల వెనక్కి వెళ్లిపోయిందని ఐక్యరాజ్యసమితి అభిప్రాయపడింది. నగరాన్ని పునర్నిర్మించాలంటే కొన్ని బిలియన్ల డాలర్ల ఖర్చు అవుతుందని తెలిపింది. ప్రతి మూడు భవనాలకు రెండు బిల్డింగులు ధ్వంసమయ్యాయని, 42 మిలియన్ టన్నుల భవనాల శిథిలాల తొలగింపునకు 21 ఏళ్లు పడుతుందని లెక్కగట్టింది. ఎకానమీ పూర్తిగా దెబ్బతిన్నదని తెలిపింది. 20 లక్షల మంది నిరాశ్రయులుగా మిగిలారని వెల్లడించింది.
Similar News
News November 24, 2025
తణుకులో సందడి చేసిన OG హీరోయిన్

సినీ హీరోయిన్ ప్రియాంక మోహన్ సోమవారం తణుకులో సందడి చేశారు. స్వయంభు కపర్ధేశ్వర స్వామి వారిని ఆమె దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆమె వెంట ప్రముఖ జ్యోతిష్యులు డాక్టర్ భమిడి అఖిల్, ఘనపాటి భమిడి సీతారామకృష్ణావధానులు ఉన్నారు.
News November 24, 2025
చదరంగం నేర్పించే జీవిత పాఠం!

చదరంగం ఆట లైఫ్లో ఛాలెంజెస్ను ఎలా ఎదుర్కోవాలో చెబుతుంది. చెస్లో ఎదుటి వ్యక్తి తప్పు చేస్తాడని ఎదురుచూస్తే మనం గెలవలేం. లైఫ్లో కూడా అలా వేచి చూడకుండా మీ స్ట్రాటజీతో అవకాశాలను క్రియేట్ చేసుకోండి. 16 పావులూ మన వెంటే ఉన్నా.. ఆఖరి నిమిషంలో మన యుద్ధం మనమే చేయాలి. లైఫ్లో కూడా అంతే.. ఇతరులపై డిపెండ్ అవ్వకుండా మీకోసం మీరే పోరాడాలి. ఇబ్బందులు వచ్చినప్పుడే మన సామర్థ్యమేంటో బయట పడుతుంది.
News November 24, 2025
రబీ రాగుల సాగు- మధ్యకాలిక, స్వల్ప కాలిక రకాలు

☛ సప్తగిరి: ఇది మధ్యకాలిక రకం. పంట కాలం 100-105 రోజులు. ముద్దకంకి కలిగి, అగ్గి తెగులును తట్టుకొని 12-15 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. ☛ వకుళ: పంట కాలం 105-110 రోజులు. దిగుబడి- ఎకరాకు 13-15 క్వింటాళ్లు. ☛ హిమ- తెల్ల గింజ రాగి రకం. పంటకాలం 105-110 రోజులు. దిగుబడి: 10-12 క్వింటాళ్లు. ☛ మారుతి: స్వల్పకాలిక రకం. పంట కాలం 85-90 రోజులు. ఎకరాకు 10-12 క్వింటాళ్ల దిగుబడిస్తుంది. అంతర పంటగా వేసుకోవచ్చు.


