News April 8, 2025
గెజిట్ జారీ.. అమల్లోకి వచ్చిన వక్ఫ్ సవరణ చట్టం

వక్ఫ్ సవరణ చట్టంపై కేంద్రం గెజిట్ జారీ చేసింది. దీంతో దేశవ్యాప్తంగా ఈ చట్టం తక్షణమే అమల్లోకి వచ్చినట్లు అయింది. ఈ చట్టంతో వక్ఫ్ బోర్డుల కింద నమోదైన ఆస్తులపై ప్రభుత్వ పర్యవేక్షణ ఉంటుంది. మరోవైపు ఈ సవరణ చట్టంపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ నెల 15, 16 తేదీల్లో అవి విచారణకు రానున్నాయి. కాంగ్రెస్, ఎంఐఎం, డీఎంకే తదితర పార్టీలు ఈ వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.
Similar News
News April 17, 2025
భారీగా పెరిగిన బంగారం ధర

బంగారం ధరలు ఆల్ టైమ్ రికార్డుకు చేరాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,050 పెరిగి రూ.89,200కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,140 పెరిగి రూ.97,310 వద్ద కొనసాగుతోంది. అటు కేజీ వెండిపై రూ.100 పెరిగి రూ.1,10,100గా ఉంది. అతి త్వరలోనే తులం బంగారం రూ.లక్షకు చేరే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.
News April 17, 2025
మత్స్యకారులకు డబుల్ ధమాకా

AP: రాష్ట్రంలోని మత్స్యకారులకు వేట నిషేధ భృతి రెట్టింపు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత ప్రభుత్వం ఇచ్చిన రూ.10 వేలకు మరో రూ.10 వేలు కలిపి రూ.20 వేలు ఇవ్వాలని భావించింది. దీంతో 1,22,968 మంది జాలర్లకు లబ్ధి చేకూరనుంది. ఈ నెల 26న లబ్ధిదారుల అకౌంట్లలో నిధులు జమ చేయనుంది. కాగా ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు వేట నిషేధం అమల్లో ఉంటుంది. ఆ సమయంలో జీవన భృతితోపాటు బియ్యం అందించనుంది.
News April 17, 2025
అల్లు అర్జున్‌కు మరో ఇన్‌స్టా అకౌంట్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రైవేట్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను మెయింటేన్ చేస్తున్నట్లు సమాచారం. ‘బన్నీ బాయ్ ప్రైవేట్’ పేరుతో ఉన్న అకౌంట్ అల్లు అర్జున్‌దే అని అభిమానులు గుర్తించారు. ఈ అకౌంట్‌ను ఆయన భార్య స్నేహ, సమంత, త్రిష, రానా, ఉపాసన, నిహారిక వంటి స్టార్లు ఫాలో అవుతున్నారు. ఈ అకౌంట్‌లో 1380 పోస్టులు చేయగా, బన్నీ 494 మందిని ఫాలో అవుతున్నారు. ఇందులో తన క్లోజ్ ఫ్రెండ్స్‌తో బన్నీ మీమ్స్ షేర్ చేస్తారట.