News February 2, 2025

GBS కలకలం.. పెరుగుతున్న మరణాలు

image

మహారాష్ట్రలో గిలియన్ బార్ సిండ్రోమ్‌తో మరో మరణం సంభవించింది. నాందేడ్‌లో 60 ఏళ్ల వృద్ధుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. దీంతో ఆ రాష్ట్రంలో GBS మరణాల సంఖ్య 5కు పెరిగింది. మరోవైపు పుణేలో కేసుల సంఖ్య 149కి చేరింది. తాజాగా అస్సాంలో తొలి GBS మరణం నమోదైంది. ఇటీవల తెలంగాణలోని సిద్దిపేటకు చెందిన <<15316737>>ఓ మహిళ<<>> ఈ వ్యాధి బారిన పడిన సంగతి తెలిసిందే.

Similar News

News December 5, 2025

భారత్ ఎప్పుడూ శాంతినే కోరుకుంటుంది: మోదీ

image

ఉక్రెయిన్‌-రష్యా శాంతి చర్చలకు మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నామని PM మోదీ తెలిపారు. ‘శాంతియుతమైన శాశ్వత పరిష్కారం కోసం చేస్తున్న ప్రయత్నాలను IND స్వాగతిస్తోంది. మా దేశం తటస్థంగా లేదు. ఎప్పుడూ శాంతివైపే నిలబడుతుంది. ఉక్రెయిన్ విషయంలోనూ అదే కోరుకుంటోంది. భారత్-రష్యా స్నేహం ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనేందుకు సహాయపడుతుందనే నమ్మకం ఉంది. ఉగ్రవాదంపై ఇరుదేశాలు కలిసి పోరాడుతున్నాయి’ అని చెప్పారు.

News December 5, 2025

మంచి దర్శకుడు దొరికితే CBN బయోపిక్‌లో నటిస్తా: శివరాజ్‌కుమార్

image

AP: విలువలు కలిగిన రాజకీయ నాయకుడు గుమ్మడి నరసయ్య బయోపిక్‌లో నటించడం గర్వంగా ఉందని కన్నడ హీరో శివరాజ్‌ కుమార్ తెలిపారు. అలాగే మంచి దర్శకుడు దొరికితే చంద్రబాబు బయోపిక్‌లో ఆయన పాత్ర పోషించడానికి సిద్ధమన్నారు. రామ్‌చరణ్ ‘పెద్ది’ మూవీలో తాను ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్టు చెప్పారు. కన్నడ ప్రజల మాదిరిగా తెలుగు ప్రేక్షకులూ తనను ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. విజయవాడ దుర్గమ్మను ఆయన దర్శించుకున్నారు.

News December 5, 2025

టెంపుళ్ల ఆదాయంపై సుప్రీం కీలక తీర్పు

image

ఆలయాల ఆదాయం దేవునికి సంబంధించిందని, బ్యాంకుల మనుగడకు ఆ నిధులు వాడుకోరాదని SC స్పష్టం చేసింది. కేరళ తిరునల్వేలి ఆలయ డిపాజిట్లను 2నెలల్లో చెల్లించాలన్న HC తీర్పుపై కొన్ని సహకార బ్యాంకులు వేసిన పిటిషన్‌ను విచారించింది. వెంటనే చెల్లించాలంటే సమస్యలున్నాయని ఆ బ్యాంకులు పేర్కొనగా ‘అది మీ సమస్య’ అంటూ CJI వ్యాఖ్యానించారు. డిపాజిట్‌దారుల్లో నమ్మకం పెంచాలని, టైమ్ పొడిగింపునకు HCని ఆశ్రయించాలని సూచించారు.