News April 1, 2025
GDH: రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు

గుడిహత్నూర్ మండలంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని సీతాగొంది జాతీయ రహదారిపై వాటర్ ట్యాంక్‌తో డివైడర్ల మధ్యలోని మొక్కలకు NHAI సిబ్బంది నీరు పడుతున్నారు. గుడిహత్నూర్ నుంచి ఆదిలాబాద్ వైపు వెళ్తున్న ఓ లారీ ట్యాంకర్‌ను ఢీకొంది. లారీ డ్రైవర్ మహమ్మద్ జలీంకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అతడిని రిమ్స్‌కు తరలించారు.
Similar News
News February 28, 2026
ఆదిలాబాద్: ఇంగ్లిష్ పరీక్షకు 364 మంది గైర్హాజరు

జిల్లావ్యాప్తంగా ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. శనివారం నిర్వహించిన ఆంగ్ల పరీక్ష సజావుగా ముగిసిందని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి (DIEO) జాదవ్ గణేష్ తెలిపారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 8,622 మంది విద్యార్థులకు గాను 8,258 మంది పరీక్షకు హాజరయ్యారని, 364 మంది గైర్హాజరైనట్లు వివరించారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ఠమైన నిఘా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
News February 28, 2026
ఆదిలాబాద్: రోబోటిక్స్ కోర్సు దరఖాస్తుకు నేడే ఆఖరు

ఆదిలాబాద్ పట్టణంలోని ATC కేంద్రంలో PMKVY 4.0 కింద ‘ఆటోమోటివ్ ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్ ఇంజినీర్’ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. మూడు నెలల కాలపరిమితి గల ఈ స్వల్పకాలిక శిక్షణ ద్వారా అభ్యర్థులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో నైపుణ్యం సాధించవచ్చన్నారు. ఆసక్తి గలవారు ఈనెల 28 సాయంత్రం 5 గంటల లోపు కళాశాలలో సంప్రదించాలన్నారు.
News February 28, 2026
ఆదిలాబాద్: ఆరుగురు దోపిడీ దొంగలు అరెస్టు

ఆదిలాబాద్ రైల్వే స్టేషన్, రిమ్స్ పరిసరాల్లో సెల్‌ఫోన్లు లాక్కొంటున్న ఆరుగురు దోపిడీ దొంగల ముఠాను టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈనెల 15న జరిగిన ఘటనపై కేసు నమోదు చేసి సీఐ నాగరాజు ఆధ్వర్యంలో నిందితులను పట్టుకున్నారు. వారిలో ఒకరు బాల నేరస్థుడు ఉన్నాడు. నిందితుల నుంచి 7 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గతంలో వీరిపై పలు కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.


