News July 17, 2024
GDK: అరుణాచల గిరి ప్రదర్శనకు ఆర్టీసీ బస్సు

గురుపౌర్ణమి పురస్కరించుకొని ఈనెల 21న అరుణాచలంలో జరిగే గిరి ప్రదక్షణకు వెళ్లే భక్తులకు TS- RTCగోదావరిఖని నుంచి తమిళనాడులోని అరుణాచలానికి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సులు ఏర్పాటు చేసినట్లు DMనాగభూషణం తెలిపారు. ఈనెల 19న రాత్రి 7 గంటలకు గోదావరిఖనిలో బయలుదేరి కరీంనగర్కు చేరుకొని అక్కడి నుంచి రాత్రి 8:45కు ప్రారంభమవుతుందన్నారు. వివరాలకు www.tsrtconline.inలో సర్వీస్ no.69999 బుక్ చేసుకోవాలన్నారు.
Similar News
News November 20, 2025
కరీంనగర్: ‘హెల్ప్ లైన్ 1098కు సమాచారం ఇవ్వండి’

బాలల హక్కుల పరిరక్షణ ప్రతిఒక్కరి బాధ్యత అని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. బాలల దినోత్సవ వారోత్సవాల ముగింపు కార్యక్రమం మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ.. బాలల సంరక్షణ చట్టాలపై అందరికీ అవగాహన తప్పనిసరిగా ఉండాలన్నారు. పాఠశాలలో అవగాహన సమావేశాలు నిర్వహిస్తూ, చిన్నారులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ధైర్యంగా 1098 హెల్ప్ లైన్కు సమాచారం ఇవ్వాలన్నారు.
News November 20, 2025
రేపు జిల్లాలో పర్యటించనున్న మంత్రి పొన్నం

కరీంనగర్ జిల్లాలో రేపు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు ఎల్ఎండీ కాలనీ వద్ద చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. అనంతరం 10 గంటలకు కొత్తపల్లి మండలం ఆసిఫ్ నగర్లోని సారధి కళామందిర్లో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఆ తరువాత హుస్నాబాద్ నియోజకవర్గంలో నిర్వహించే కార్యక్రమాలలో పాల్గొంటారు.
News November 20, 2025
హనుమాన్ నగర్లో వ్యక్తి అనుమానాస్పద మృతి

కరీంనగర్లోని హనుమాన్ నగర్లో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. చుట్టుపక్కల వారికి దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, మృతుడిని కోహెడ మండలం కూరెళ్ల గ్రామానికి చెందిన బాలరాజుగా గుర్తించారు. మేస్త్రీ పని చేసుకుంటూ కొంతకాలంగా ఒంటరిగా కిరాయి ఉంటున్నట్లు తెలిసింది. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.


