News January 14, 2025
GDK: ఇలాగైతే ప్రమాదాలు జరగవా!

గోదావరిఖని మాతంగి కాంప్లెక్స్ రోడ్డుపై ఓ పక్క రోడ్డు కుంగిపోవడంతో ప్రమాదాలకు నిలయంగా మారిందని స్థానికులు తెలిపారు. ఇటీవల రోడ్డుపై గుంత ఏర్పడి, క్రమక్రమంగా అది పెద్దగా అవుతుండటంతో గుర్తించేందుకు వీలుగా స్థానికులు దానికో గుడ్డ పీలిక చుట్టారు. ఇదంతా అధికారులు చూస్తున్నప్పటికీ మరమ్మతులు చేయకపోవడంతో వాహనదారులు రాత్రి సమయాల్లో ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి ఏర్పడింది. మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.
Similar News
News February 17, 2025
కరీంనగర్‌లో కేసీఆర్ జన్మదిన వేడుకలు

కరీంనగర్ నగరంలోని తెలంగాణ చౌక్‌లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 71వ జన్మదినం సందర్భంగా సోమవారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. జనం మెచ్చిన నాయకుడు కేసీఆర్ అని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన నాయకుడు అని కొనియాడారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
News February 17, 2025
కరీంనగర్‌తో కేసీఆర్‌కు విడదీయరాని బంధం

కరీంనగర్ అంటేనే.. కేసీఆర్ అని బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు చెప్పుకుంటాయి. KCRకు KNR జిల్లాతో విడదీయరాని బంధం ఉంది. ప్రత్యేక తెలంగాణే ధ్యేయంగా టీఆర్‌ఎస్ పార్టీని ఏర్పాటుచేయనున్నట్లు 2001లో KNR గడ్డపైనే ప్రకటించారు. 2004లో కరీంనగర్ నుంచి ఎంపీగా గెలిచారు. 2018, మే 10న రైతుబంధును ఇక్కడే ప్రారంభించారు. త్వరలో బీఆర్‌ఎస్ భారీ బహిరంగ సభను కరీంనగర్‌లోనే ఏర్పాటుచేయనున్నట్లు సమాచారం. దీనిపై మీ కామెంట్.
News February 17, 2025
కరీంనగర్: ఇంటర్ విద్యార్థులకు మరొక అవకాశం

ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలకు గైర్హాజరైన విద్యార్థులకు ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయం మరొక అవకాశం కల్పించింది. ఈనెల 3 నుంచి 16వరకు ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ నిర్వహించారు. గైర్హాజరైన విద్యార్థులకు ఈ నెల 18 నుంచి 22వరకు KNRలోని ప్రభుత్వ ఆర్ట్స్ జూనియర్ కాలేజీలో ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. విద్యార్థులు ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో డీఐఈవోను సంప్రదించి అనుమతి తీసుకోవాలి.