News March 25, 2025
GDK: తెల్లవారుజామున యాక్సిడెంట్.. ఒకరి మృతి

హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్- ఎల్కతుర్తి రహదారిపై మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, లారీ ఎదురెదురుగా ఢీకొనడంతో కారు నుజ్జునుజ్జయింది. అందులో ప్రయాణిస్తున్న కనకపూడి కర్ణాకర్ అనే పాస్టర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు గోదావరిఖనికి చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎంకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News April 2, 2025
ములుగు: ‘రజతోత్సవ సభను విజయవంతం చేస్తాం’

బీఆర్ఎస్ ఆవిర్భవించి 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈనెల 27న వరంగల్‌లో నిర్వహించనున్న రజతోత్సవ సభను విజయవంతం చేస్తామని ములుగు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ బడే నాగజ్యోతి అన్నారు. ఈరోజు హైదరాబాదులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్వహించిన రజతోత్సవ సన్నాహక సమావేశంలో వారు పాల్గొన్నారు.
News April 2, 2025
కేంద్రీయ విద్యాలయంలో అడ్మిషన్లు

నల్గొండ కేంద్రీయ విద్యాలయంలో 2వ తరగతి నుంచి 9 వరకు ఆఫ్ లైన్లో అడ్మిషన్స్ ఈ నెల 2 నుంచి ప్రారంభం కానున్నాయని ప్రిన్సిపల్ శ్రీనివాసులు తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తులను విద్యాలయంలో పొందవచ్చన్నారు. దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 11 చివరి తేది అని పేర్కొన్నారు.
News April 2, 2025
మామునూరు: GREAT.. గ్రూప్-1 ఆఫీసర్‌గా వాచ్మెన్ కుమారుడు

వరంగల్ జిల్లాకు చెందిన వాచ్మెన్ కుమారుడు గ్రూప్-1 ఆఫీసర్‌గా ఎంపికయ్యాడు. మామునూరుకు చెందిన జయ-రవికుమార్ దంపతుల కుమారుడు రాహుల్ ఇటీవల TGPSC విడుదల చేసిన గ్రూప్1 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్‌లో 555వ ర్యాంక్, మల్టీ జోన్-1 SC కేటగిరీలో 23వ ర్యాంక్ కైవసం చేసుకున్నాడు. 2023-2024లో టీజీపీఎస్సీ నిర్వహించిన ఏవో, జేఏఓ ఎగ్జామ్‌లో రాహుల్ జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్(జేఏఓ)గా ఎన్నికయ్యారు.