News August 20, 2025
GDK: పట్టణంలో ఘనంగా తీజ్ మాత ఉత్సవాలు

గోదావరిఖని పట్టణంలోని బొందిలి కులస్తులు తీజ్ మాత ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 9 రోజులపాటు వెదురు బుట్టలో ఎర్రటి మట్టి వేసి అందులో నవ ధాన్యాలు నాటి మొలకెత్తిన అనంతరం వాటిని ప్రత్యేకంగా పూజిస్తారు. మొక్కలు ఎంత పెరిగితే అంతా తమ కుటుంబం సుఖసంతోషాలతో ఉంటుందని విశ్వసిస్తారు. అనంతరం వాటిని గోదావరి నదిలో కలిపి, పెద్దవారి ఆశీర్వాదాలు తీసుకుంటారు. బొందిలి కులస్తులు పాల్గొన్నారు.
Similar News
News April 5, 2026
నెల్లూరు జిల్లాలో వారసులు ఎంట్రీ ఇస్తారా…?

వచ్చే ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుంచి తన తమ్ముడు గిరిధర్ రెడ్డి బరిలో ఉంటారని MLA శ్రీధర్ రెడ్డి చెబుతున్నారు. మహిళకు రిజర్వ్ అయితే తన కుమార్తె లక్ష్మీహైందవి, వైష్ణవి, గిరిధర్ కుమార్తె సాయి శశిర రెడ్డిలో ఒకరికి టికెట్ తెచ్చుకోవాలని ప్లాన్ చేస్తున్నారంట. గత ఎన్నికల్లో ప్రచారం చేసిన మంత్రులు ఆనం, నారాయణ కుమార్తెలు కైవల్య, షరిణి, సోమిరెడ్డి కోడలు శ్రుతిరెడ్డి సైతం బరిలో ఉంటారని ఉహాగానాలు మొదలయ్యాయి.
News April 5, 2026
మరో అమెరికన్ ఫ్లైట్‌ను కూల్చేసిన ఇరాన్?

ఇరాన్‌లో కూలిన F-15E యుద్ధ విమానంలోని రెండో పైలట్‌ను కాపాడినట్లు ట్రంప్ ప్రకటించిన గంటల్లోనే అమెరికాకు మరో షాక్ తగిలినట్లు సమాచారం. రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్న మరో విమానాన్ని కూల్చినట్లు IRGC ప్రకటించింది. ఇస్ఫహాన్ సౌత్‌లో ఈ ఘటన జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని అమెరికా ఇంకా ధ్రువీకరించలేదు.
News April 5, 2026
MBNR: బాబు జగ్జీవన్ జయంతి.. నివాళులు అర్పించిన ఎస్పీ

మహబూబ్‌నగర్ పట్టణంలోని తెలంగాణ చౌరస్తాలో బాబు జాగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు విగ్రహానికి జిల్లా ఎస్పీ డి.జానకి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఎస్పీ మాట్లాడుతూ.. బాబు జగ్జీవన్ రావు భారతదేశ స్వాతంత్ర్య సమరయోధుడిగా, సామాజిక న్యాయం కోసం పోరాడిన మహానుభావుడిగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు. పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


