News March 21, 2024
GDK: లారీని ఢీకొన్న బైక్.. ఒకరు మృతి
లారీని ఢీకొని ఒకరు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలైన ఘటన GDKలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. GDK నుంచి మంథని రహదారిలో మూసి వేసిన త్రీ ఇంక్లైన్ రోడ్డు వద్ద ఆగి ఉన్న బొగ్గు లారీని ద్విచక్ర వాహనం వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కాకతీయ నగర్‌కి చెందిన మంద కిరణ్ తలకు గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. మంథని ఎగ్లాస్పూర్‌కి చెందిన రాకేష్ తీవ్రంగా గాయపడ్డాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News September 19, 2024
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్
@ కోనరావుపేట మండలంలో ఏకలవ్య మోడల్ స్కూల్ ను తనిఖీ చేసిన సిరిసిల్ల కలెక్టర్. @ బీర్పూర్ మండలంలో అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక డంపుల సీజ్. @ ఎల్లారెడ్డిపేట మండలంలో గణేష్ నిమజ్జన ఊరేగింపులో ట్రాక్టర్ కిందపడి యువకుడి మృతి. @ ఇండియన్ ఐకాన్ అవార్డు అందుకున్న కరీంనగర్ జిల్లా వాసి. @ ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణమాఫీ వర్తింపచేయాలని జగిత్యాల కలెక్టర్ కు బిఆర్ఎస్ నాయకులు వినతి.
News September 18, 2024
నిర్దేశించిన గడువులోగా రైస్ డెలివరీ పూర్తి చేయాలి: కలెక్టర్
నిర్దేశించిన గడువులోగా ఖరీఫ్ 2023-24, రబీ సీజన్‌లకు సంబంధించి పెండింగ్ రైస్ డెలివరీని తప్పనిసరిగా పూర్తి చేయాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష మిల్లర్లను ఆదేశించారు. అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్‌తో కలిసి జిల్లాలోని రైస్ మిల్లర్లు, సంభందిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. రైస్ డెలివరీ ఆలస్యం చేస్తున్న రైస్ మిల్లులను అధికారులు క్షేత్ర స్థాయిలో తనిఖీ చేయాలని సూచించారు.
News September 18, 2024
మాదక ద్రవ్యాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు: కరీంనగర్ కలెక్టర్
గంజాయి, మాదక ద్రవ్యాల వినియోగం నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో వర్చువల్ నార్కో సమన్వయ సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు మిషన్ పరివర్తన్‌లో భాగంగా గంజాయి, డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించాలన్నారు.