News September 24, 2024
GDK: సింగరేణి సంస్థకు రూ.2 వేల కోట్ల లాభాలు

సింగరేణి సంస్థ లాభాల జోష్‌లో ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో అధిక లాభాలు సాధించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించగా.. రూ.2,388.50 కోట్ల లాభాలు సాధించింది. అయితే, గతంలో కన్నా ఈసారి 1 శాతం పెంచి 33 శాతం కార్మికుల వాటాగా చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో పాటు దసరా బోనస్ కూడా ప్రకటించడంతో గోదావరిఖని కార్మికుల్లో సంతోషం వ్యక్తమవుతోంది.
Similar News
News January 25, 2026
KNR: ‘విద్యార్థులను తీర్చిదిద్దడం ముఖ్య ఉద్దేశం’

కరీంనగర్ కలెక్టరేట్లో శనివారం నిర్వహించిన టెడ్ టాక్స్‌తో నిర్వహించిన విద్యార్థులు అందరినీ ఆకట్టుకున్నారని అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రభుత్వ విద్యార్థులకు వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చి వారిని తీర్చిదిద్దడం జిల్లా యంత్రాంగం ముఖ్య ఉద్దేశమని అన్నారు. రానున్న రోజుల్లో ఈ కార్యక్రమాలు మరిన్ని కొనసాగిస్తామని తెలిపారు.
News January 25, 2026
KNR: ఆర్థిక ఇబ్బందులు.. తండ్రి ఆత్మహత్య!

ఉద్యోగాలు రాని కొడుకులు.. వసూలు కాని అప్పులతో మనస్తాపం చెందిన ఓ తండ్రి బలవన్మరణానికి పాల్పడ్డారు. కరీంనగర్(D) మానకొండూరు మండలం అన్నారానికి చెందిన శంకరాచారి (58) శనివారం తేజాప్ తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. కొడుకులకు ఉద్యోగాలు రాకపోవడం, ఇచ్చిన అప్పుల వసూలుకావడం లేదనే బాధతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
News January 24, 2026
KNR: ఆర్టీసీకి 14 రోజుల్లో రూ.46.37 కోట్ల ఆదాయం

సంక్రాంతి పండుగ సందర్భంగా కరీంనగర్ రీజియన్ పరిధిలో ఆర్టీసీకి భారీ ఆదాయం సమకూరింది. ఈనెల 7 నుంచి 20వ తేదీల్లో మొత్తంగా 1528 అదనపు బస్సులు నడపగా.. 14 రోజుల్లో రూ.46.37 కోట్లు ఆదాయం వచ్చింది. ఇక కరీంనగర్ రీజియన్ పరిధిలో కరీంనగర్-2 డిపోలో రూ.7.78 కోట్లతో మొదటి స్థానంలో ఉండగా మంథని డిపోలో రూ. 2.43 కోట్లతో చివరి స్థానంలో ఉంది.


