News October 7, 2025

GDK: కష్టపడి చదివితే విజయం వరిస్తుంది: గ్రూప్- 1 విజేత

image

కష్టపడి చదివితే విజయం వరిస్తుందని గ్రూప్ 1లో DSP ఉద్యోగం సాధించిన లతీఫా ఆశా అన్నారు. GDK మార్కండేయ కాలనీకి చెందిన ఆమెను, తండ్రి దాదా సలాంను ఆత్మీయంగా సన్మానించారు. ఈ సందర్భంగా లతీఫా మాట్లాడుతూ.. నేటి యువత సామాజిక మాధ్యమాలపై దృష్టి సారించకుండా దీక్ష, పట్టుదలతో చదువుకోవాలన్నారు. తండ్రి డిగ్రీ కాలేజ్ రిటైర్డ్ ప్రిన్సిపల్ సలాం మాట్లాడుతూ.. తన కుమార్తె DSPగా ఉద్యోగం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

Similar News

News October 7, 2025

TDPతో పొత్తు వద్దు: నడ్డాకు BJP నేత రహస్య లేఖ

image

జూబ్లీహిల్స్‌లో TDPతో పొత్తు సమీకరణాలపై TBJPలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సుహాసినికి చంద్రబాబు కూటమి టికెట్ ఇప్పిస్తారనే ప్రచారంపై ఓ ముఖ్య నేత JP నడ్డాకు లేఖ రాశారని విశ్వసనీయ సమాచారం. ఈ పొత్తుతో రేవంత్‌కు AP CM లాభం చేకూర్చారనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయని, ఈ పరిణామం తెలంగాణలో BJP వృద్ధికి అడ్డుగా ఉండొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే BJP-PCC ఒకటని BRS ఆరోపిస్తుండటం తెలిసిందే.

News October 7, 2025

నిబంధనలకు లోబడి దీపావళి టపాసులు అమ్మాలి: కలెక్టర్

image

భీమవరం కలెక్టరేట్‌లో దీపావళి టపాసుల తయారీ, అమ్మకాలకు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై కలెక్టర్ నాగరాణి, ఎస్పీ అద్నాన్ నయీం అస్మి మంగళవారం అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలంతా దీపావళి పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలన్నారు. టపాసులు విక్రయించేవారు ప్రభుత్వ నిబంధనలను లోబడి మాత్రమే అమ్మకాలు చేపట్టాలని హెచ్చరించారు. భద్రతా ప్రమాణాలను పక్కాగా పాటించాలని ఆదేశించారు.

News October 7, 2025

గూడూరు: వైన్ షాపులకు దరఖాస్తు స్వీకరణ: ఎక్సైజ్ CI

image

గూడూరు ఎక్సైజ్ పరిధిలోని 12 షాపులకు 2025-27 మద్యం పాలసీలో భాగంగా మంగళవారం ఒక దరఖాస్తు స్వీకరించినట్లు CI బిక్షపతి తెలిపారు. గూడూరు 2, గంగారం 2, కొత్తగూడ 2, కేసముద్రంలో 1 (ST), కేసముద్రం1, ఇనుగుర్తి 1 (SC), కేసముద్రం2, గుండెంగ 1 షాపులను (జనరల్)గా కేటాయించినట్లు CI పేర్కొన్నారు. వీటికి సంబంధించి మహబూబాబాద్ IDOCలో దరఖాస్తు స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు.