News September 23, 2025
GDK: ‘కార్మికులకు అన్యాయం జరిగింది’

సింగరేణి లాభాల వాటా కంపెనీలో కార్మికులకు అన్యాయం జరిగిందని గుర్తింపు కార్మిక సంఘం(AITUC) అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. CM రేవంత్ రెడ్డి ఏకపక్షంగా ప్రకటించారని అన్నారు. వాస్తవ లాభాలలో కార్మికులకు వాటా ఇవ్వాల్సి ఉండేదన్నారు. కార్మిక సంఘాల నాయకులకు ఎలాంటి సమాచారం లేకుండా ప్రకటించడం సరైన విధానం కాదన్నారు.
Similar News
News September 23, 2025
దక్షిణాదిలో జనాభా తగ్గిపోతోంది: చంద్రబాబు

AP: అభివృద్ధి చెందిన దేశాల్లో జనాభా తగ్గిపోతోందని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో పేర్కొన్నారు. ‘మన దేశంలో సగటు జీవిత కాలం 70 ఏళ్లుగా ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గుతోంది. యూపీ, బిహార్ వల్లే ఆ లెక్కలు బ్యాలెన్స్ అవుతున్నాయి. వచ్చే ఏడాదికి రాష్ట్రంలో జనాభా 5.37 కోట్లకు చేరుకుంటుంది. WHO ప్రకారం మన రాష్ట్రంలోనే PHCలు, మెడికల్ ఆఫీసర్లు ఎక్కువగా ఉన్నారు’ అని తెలిపారు.
News September 23, 2025
MBNR: PU..కబడ్డీ సౌత్ జోన్ క్రీడాకారుల ఎంపిక

పాలమూరు విశ్వవిద్యాలయంలో సౌత్ జోన్‌లో పాల్గొనేందుకు కబడ్డీ ఎంపికలు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా యూనివర్సిటీ ఉపకులపతి ప్రొ.జి.ఎన్.శ్రీనివాస్,రిజిస్ట్రార్ ప్రొ.పి.రమేష్ బాబు, విద్యా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఆదేర్ల కరుణాకర్ రెడ్డి ప్రారంభించారు. ధైర్యం, నిబద్ధత, క్రీడా స్ఫూర్తితో ఆడి విశ్వవిద్యాలయం పేరు ప్రతిష్ఠలు జాతీయస్థాయిలో నిలపాలన్నారు. పీడీలు సత్యభాస్కర్ రెడ్డి, శ్రీనివాసులు పాల్గొన్నారు.
News September 23, 2025
రేపు పియూలో జాతీయ సేవా పతాక దినోత్సవ వేడుకలు

పాలమూరు యూనివర్సిటీలో సెమినార్ హాల్లో జాతీయ సేవా పథకం దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు వివిధ పోటీలను నిర్వహించారు. రేపు జాతీయసేవ పథకం దినోత్సవం వేడుకలలో భాగంగా విద్యార్థులకు వ్యాసరచన,ఉపన్యాస,పాటల పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు ముఖ్య అతిథులచే బహుమతులు ప్రదానం చేయనున్నారు. ప్రోగ్రాం అధికారులు డాక్టర్ అర్జున్ కుమార్,డాక్టర్ ఈశ్వర్ కుమార్,డాక్టర్ జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.