News April 11, 2025
GDK: గతంలో తల్లి కిడ్నీ దానం చేసింది… అయినా దక్కని ప్రాణాలు

గోదావరిఖని రాంనగర్ కు చెందిన జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యుడు నీలం ఐలయ్య కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఈరోజు మరణించారు. ఇటీవల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. గత కొంతకాలం క్రితం ఐలయ్యకు తల్లి ఒక కిడ్నీ దానం చేశారు. కొంతకాలం ఆరోగ్యంగా ఉన్న ఐలయ్య ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. ఐలయ్య మరణించడం పట్ల పలువురు సంతాపం ప్రకటించారు.
Similar News
News April 18, 2025
చెత్త నుంచి సంపదతోనే సర్క్యులర్ ఎకానమీ సాధ్యం: సీఎం

AP: స్వర్ణాంధ్ర-2047 సంకల్పంలో భాగంగా ప్రతినెలా మూడో శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నామని CM చంద్రబాబు చెప్పారు. ‘ఈసారి e-వ్యర్థాల సేకరణ-సురక్షితంగా రీసైకిల్ చేయడమనే థీమ్‌ను ఎంచుకున్నాం. చెత్త నుంచి సంపద సృష్టితోనే సర్క్యులర్ ఎకానమీ సాధ్యమవుతుంది. రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ అనేది వ్యర్థాల సేకరణ కేంద్రాల నినాదం కావాలి. ఈ కార్యక్రమంలో ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొనాలి’ అని ట్వీట్ చేశారు.
News April 18, 2025
నల్లాలకు మోటార్లు బిగిస్తే చర్యలు: SRPT కమిషనర్

సూర్యాపేట పట్టణంలో నల్లాలకు నేరుగా మోటార్లు పెట్టి నేరుగా నీటిని వాడుకుంటున్న 18, 34, 35 వార్డుల ఇళ్లలో శుక్రవారం మున్సిపల్ సిబ్బంది ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అక్రమంగా నీటిని పట్టుకుంటున్న 10 మోటార్లు సీజ్ చేసినట్లు మున్సిపల్ కమిషనర్ బి.శ్రీనివాస్ తెలిపారు. గృహ యజమానులు నీటి పంపుకు నేరుగా మోటార్లు పెట్టి నీటిని వాడుకుంటే మున్సిపల్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News April 18, 2025
నెల్లూరు కార్పొరేషన్ ఇన్ఛార్జ్ కమిషనర్‌గా నందన్

నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ సూర్య తేజ బదిలీ అయిన విషయం తెలిసిందే. నూతన కమిషనర్‌గా ఇంకా ఎవరిని నియమించలేదు. ఈ నేపథ్యంలో నెల్లూరు కార్పొరేషన్ అదనపు కమిషనర్ నందన్‌ను ఇన్ఛార్జ్ కమిషనర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.