News October 16, 2025
GDK: ‘బంద్‌కు జిల్లా ముదిరాజ్ సంఘం పూర్తి మద్దతు’

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని బీసీ సంఘాలు ఈ నెల 18న ఇచ్చిన బంద్ పిలుపునకు పెద్దపల్లి జిల్లా ముదిరాజ్ సంఘం తరపున నాయకులు మద్దతు ప్రకటించారు. గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ నెల 18న జరుగనున్న బంద్‌లో ముదిరాజ్ కుల బంధువులందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
Similar News
News October 16, 2025
స్వచ్ఛభారత్ మిషన్ పనులు పూర్తి చేయాలి: కలెక్టర్

జిల్లాలో స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా చేపట్టవలసిన టాయిలెట్స్ నిర్మాణాలను ఈ నెలాఖరులోగా పూర్తిచేయాలని ఏలూరు కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. అధికారుల సమీక్షలో గురువారం కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలోని 52 ప్రభుత్వ వసతి గృహాలకు మరమ్మతులు చేపట్టేందుకు రూ.5.73 కోట్లు మంజూరు చేశారన్నారు. నిర్దేశించిన సమయంలోగా అధికారులు పనులు పూర్తిచేయాలన్నారు.
News October 16, 2025
17న విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం

చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో జిల్లాస్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహిస్తున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ డీడీ విక్రమ్ కుమార్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 17న ఉదయం 10 గంటలకు కలెక్టర్ కార్యాలయంలో సమావేశం జరుగుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం అమలుపై ఈ సమావేశంలో సమీక్షిస్తామని చెప్పారు. సభ్యులందరూ సకాలంలో హాజరు కావాలని కోరారు.
News October 16, 2025
ములుగు: TOMCOMలో ఉపాధి కల్పనకు దరఖాస్తు చేసుకోండి: తులా రవి

తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్(TOMCOM) ఆధ్వర్యంలో నిర్వహించే జాబ్ మేళాకు జిల్లాలోని నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పనాధికారి తుల రవి తెలిపారు. గ్రీసులో హాస్పిటల్, సేవారంగంలో ఉపాధి కల్పించబడుతుందని అన్నారు. హోటల్ మేనేజ్మెంట్ డిప్లమా/డిగ్రీ కలిగిన వారు అర్హులని, పూర్తి వివరాలకు www.tomcom.telangana.gov.in వెబ్ సైట్‌ను సంప్రదించాలని ఆయన సూచించారు.