News November 11, 2025
GDK: ‘బలహీనత కాదు.. మానసిక ధైర్యానికి సంకేతం’

తమ సమస్యలను నమ్మకంగా పంచుకోవడం, అవసరమైతే సహాయం కోరడం అనేది బలహీనత కాదని, అది మానసిక ధైర్యానికి సంకేతమని రామగుండం సీపీ అంబర్ కిషోర్ అన్నారు. రామగుండం కమిషనరేట్‌లో ప్రత్యేక వైద్య నిపుణుల సహాయంతో పోలీసులకు మంగళవారం అవగాహన నిర్వహించారు. పోలీసు సిబ్బందికి వ్యక్తిగత భద్రత, స్వీయ క్రమశిక్షణ, ప్రవర్తనా నియమావళిపై ఈ అవగాహన కార్యక్రమం కొనసాగింది.
Similar News
News November 11, 2025
స్థిరాస్తి అమ్మకం సేవా పన్ను పరిధిలోకి రాదు: SC

స్థిరాస్తి అమ్మకాలు సర్వీస్ ట్యాక్స్ పరిధిలోకి రావని SC స్పష్టం చేసింది. సహారా కంపెనీకి ‘ఎలిగెంట్ డెవలపర్స్’ 2002-05లో గుజరాత్, హరియాణా, MHలోని తన భూములను అవుట్‌రైట్ సేల్ చేసింది. అయితే ‘రియల్ ఏజెంటు’గా అమ్మినందున ₹10.28CR సర్వీస్ ట్యాక్స్ కట్టాలని DGCEI నోటీసులు ఇచ్చింది. వీటిని సంస్థ సవాల్ చేయగా CESTAT రద్దుచేసింది. దీనిపై సర్వీస్ ట్యాక్స్ కమిషనర్ దాఖలు చేసిన పిటిషన్‌పై SC తాజా తీర్పు ఇచ్చింది.
News November 11, 2025
ఇంజినీర్ పోస్టులకు RITES నోటిఫికేషన్

రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్( <
News November 11, 2025
మెట్‌పల్లి: తండ్రిని హత్య చేసిన కుమారుడి అరెస్టు

మెట్‌పల్లి పట్టణంలోని దుబ్బవాడలో ఎల్లగంగ నరసయ్య(74)ను హత్య చేసిన ఆయన కుమారుడు ఎల్ల అన్వేష్(32)ను మంగళవారం అరెస్టు చేసినట్లు ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు. తండ్రి పెళ్లి చేయలేదని, ఏదైన పనిచేయమని ఒత్తిడి చేయడంతోనే హత్యకు పాల్పడినట్లు వివరించారు. నిందితుడి నుంచి హత్యకు ఉపయోగించిన కర్ర, మొబైల్ ఫోన్, ధరించిన దుస్తులను స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.


