News August 31, 2025
GDK: ‘ర్యాగింగ్‌ను అరికట్టేందుకు ప్రతీ ఒక్కరూ పాటుపడాలి’

ర్యాగింగ్‌ను అరికట్టేందుకు ప్రతీ ఒక్కరూ పాటుపడాలని గోదావరిఖని అదనపు జిల్లా న్యాయమూర్తి డాక్టర్ టీ.శ్రీనివాస రావు అన్నారు. శనివారం ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో మండల న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో మాట్లాడారు. ఎవరైనా ర్యాగింగ్ పాల్పడితే జైలు శిక్ష, విద్యా సంస్థ నుంచి సస్పెండ్ చేయడం తప్పదన్నారు. చట్టాలపై అవగాహన కల్పించారు.
Similar News
News August 31, 2025
మైనర్లకు వాహనాలిస్తే రూ.లక్ష జరిమానా!

TG: 18 ఏళ్లు నిండకుండానే బైకులతో రోడ్లపై రయ్ రయ్ అంటూ మైనర్లు దూసుకెళ్తూ ప్రమాదాల బారిన పడుతున్న ఘటనలు చాలా ఉన్నాయి. ఈ ప్రమాదాల్లో తమ పిల్లలు ప్రాణాలు కోల్పోకూడదని జనగామ(D) నాగిరెడ్డిపల్లి గ్రామం వినూత్న నిర్ణయం తీసుకుంది. 18 ఏళ్లు నిండని వారు వాహనాలు నడిపితే పెరెంట్స్‌కు రూ.లక్ష జరిమానా విధించాలని తీర్మానించింది. ప్రమాదాల నివారణకు బాధ్యతతో ఈ గ్రామం తీసుకున్న నిర్ణయం అన్ని గ్రామాలకు ఆదర్శనీయం.
News August 31, 2025
WNP: బీసీలకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం కృషి: మంత్రి

బీసీలకు న్యాయం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఈరోజు అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. ‘బీసీ బిల్లుకు బీఆర్ఎస్, బీజెపి సహకరించాలి. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు దక్కాలి. కాంగ్రెస్ కేంద్రంలో పవర్లో ఉన్నప్పుడే తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లకు ఆమోదం లభించింది. బీసీ మంత్రిపై బీఆర్ఎస్ బీసీ నేత తప్పుగా మాట్లాడడం సరికాదు’ అని అన్నారు.
News August 31, 2025
శ్రీశాంత్ భార్య ఎందుకు ఫైరవుతున్నారు: లలిత్

IPL-2008 సమయంలో శ్రీశాంత్‌ను హర్భజన్ చెంపదెబ్బ కొట్టిన వీడియో బయట పెట్టడంపై <<17559909>>శ్రీశాంత్ భార్య<<>> ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీనిపై లలిత్ మోదీ స్పందించారు. ‘శ్రీశాంత్ భార్య ఎందుకు ఫైరవుతున్నారో నాకర్థం కాలేదు. ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు ఏం జరిగిందనే నిజాన్ని షేర్ చేశా. శ్రీశాంత్ బాధితుడు. నేను సరిగ్గా అదే చెప్పా. గతంలో నన్నెవరూ ఈ ప్రశ్న అడగలేదు. క్లార్క్ అడిగితేనే స్పందించా’ అని తెలిపారు.