News September 19, 2025
GDK: సుబ్రహ్మణ్యం నిర్ణయాలతో కంపెనీకి లాభాలు: లలిత్

సింగరేణి సంస్థలో GM(CCO) కార్పొరేట్ విభాగంలో విధులు నిర్వహించి సుబ్రహ్మణ్యం తీసుకున్న నిర్ణయాలతో కంపెనీకి లాభాలు చేకూర్చారని రామగుండం సింగరేణి సంస్థ RG-1 GMలలిత్ కుమార్ అన్నారు. ఈనెల చివరన ఆయన పదవీ విరమణ పొందుతున్న సందర్భంగా స్థానిక సింగరేణి GMకార్యాలయంలో ఆత్మీయంగా సన్మానించారు. అధికారులు రవీందర్ రెడ్డి, బ్రహ్మాజీరావు, సుభాశ్, కృష్ణ ప్రసాద్, శ్రీధర్, నరసింహారెడ్డి, రాజేందర్, తిరుపతి ఉన్నారు.
Similar News
News September 19, 2025
వచ్చే ఏడాది చైనాలో పర్యటిస్తా: ట్రంప్

భారత్‌తో వైరం పెంచుకుంటున్న ట్రంప్.. చైనాతో స్నేహం కోరుకుంటున్నారు. 3 నెలల తర్వాత తొలిసారి జిన్‌పింగ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఇద్దరి మధ్య స్నేహపూర్వక చర్చలు జరిగాయని, టిక్‌టాక్ డీల్‌కు ఆమోదం లభించినట్లు ట్రంప్ తెలిపారు. ఇక వచ్చేనెల సౌత్ కొరియాలో జరిగే ఆసియా-పసిఫిక్ ఎకానమిక్ కో-ఆపరేషన్ సమ్మిట్‌లో జిన్‌పింగ్‌ను కలవనున్నట్లు వెల్లడించారు. వచ్చే ఏడాది చైనాలో పర్యటిస్తానని ట్రంప్ చెప్పుకొచ్చారు.
News September 19, 2025
లిక్కర్ స్కాం కేసు: వైఎస్ అనిల్ రెడ్డి కంపెనీల్లో సోదాలు

AP: లిక్కర్ స్కాం కేసులో విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఓ వైపు ఈడీ, మరోవైపు సిట్ నిందితుల ఇళ్లలో తనిఖీలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా వైఎస్ జగన్ సమీప బంధువుగా ప్రచారం జరుగుతున్న వైఎస్ అనిల్‌కు సంబంధించిన కంపెనీలు, ఇళ్లల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టింది. హైదరాబాద్, చెన్నైలోని సంస్థల్లో తనిఖీలు చేసింది. అనిల్ రెడ్డి కంపెనీల ద్వారా ముడుపుల లావాదేవీలు జరిగినట్లు సిట్ ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది.
News September 19, 2025
ఏలూరు: ఈవీఎం గోడౌన్ ను తనిఖీ చేసిన కలెక్టర్

ఏలూరు కలెక్టరేట్ ప్రాంగణంలో ఉన్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల (ఈవీఎం) గోడౌన్‌ను జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా, ఆమె వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి సీసీ కెమెరాల ద్వారా భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గోడౌన్‌కు పటిష్టమైన భద్రత కల్పించినట్లు ఆమె తెలిపారు. పోలీసు సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు.