News October 15, 2025
GDK: స్పెషల్ యాత్రలకు బయలుదేరిన సూపర్ లగ్జరీ

GDK డిపో నుంచి వివిధ పుణ్యక్షేత్రాలు, విహారయాత్రల కోసం సూపర్ లగ్జరీ బస్సు బుధవారం ఉదయం బయలుదేరింది. రామప్ప, లక్నవరం, బొగత జలపాతాలు, మేడారం దర్శనాలకు యాత్రికులను తీసుకెళ్లనున్నారు. యాత్రికుల సౌకర్యార్థం ప్రత్యేక రౌండ్ ట్రిప్ ప్యాకేజీలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇక ముందు కూడా దూర ప్రాంతాలకు యాత్ర ప్యాకేజీలు ఉంటాయని, పూర్తి వివరాల కోసం 7013504982 నంబర్‌ను సంప్రదించాలని అధికారులు కోరారు.
Similar News
News October 15, 2025
విజయవాడలో ఉమ్మడి కృష్ణా జిల్లా కూటమి నేతల భేటీ

ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రజాప్రతినిధులతో మంత్రి కొల్లు రవీంద్ర బుధవారం భేటీ అయ్యారు. విజయవాడ R&B గెస్ట్ హౌస్‌లో జరిగిన ఈ భేటీలో కార్పొరేషన్ ఛైర్మన్‌లు, పలువురు MLAలు హాజరయ్యారు. కల్తీ మద్యం కేసు తర్వాత జిల్లాలో నెలకొన్న రాజకీయ పరిణామాలపై చర్చించారు. కల్తీ మద్యం కేసులో ప్రభుత్వాన్ని అస్థిరపరిచే విధంగా YCP పన్నిన కుట్రపై కూటమి నేతలు చర్చించారు. YCP కుట్రలను సమర్ధవంతంగా తిప్పికొట్టాలని మంత్రి కోరారు.
News October 15, 2025
NGKL: అథ్లెటిక్స్ సాంకేతిక అధికారిగా పదర వాసి

వరంగల్ జిల్లా జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ఈనెల 16, 18వ తేదీ వరకు జరుగనున్న ఇండియన్ ఓపెన్ అండర్-23 అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్‌కు పదర మండల కేంద్రానికి చెందిన సీనియర్ క్రీడాకారుడు ఎడ్మ శ్రీను యాదవ్ సాంకేతిక అధికారిగా ఎంపికయ్యారు. ఆయన మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి సాంకేతిక అధికారిగా బాధ్యతలు అప్పజెప్పిన TG అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి సారంగపాణి, టెక్నికల్ కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.
News October 15, 2025
బిహార్ ఎన్నికలకు 12 మందితో BJP రెండో జాబితా

బిహార్ ఎన్నికలకు BJP 12 మంది అభ్యర్థులతో రెండో విడత జాబితాను విడుదల చేసింది. NDAలోని పార్టీలతో ఒప్పందంలో భాగంగా BJP 101 స్థానాల్లో పోటీ చేయనుంది. ఇప్పటివరకు 83 స్థానాలకు ఆ పార్టీ అభ్యర్థులను ఖరారు చేయగా ఇంకా 18 సీట్లకు ప్రకటించాల్సి ఉంది. కూటమిలోని జేడీయూ 48 మందితో జాబితాను ప్రకటించింది. మరోవైపు JSP 51 స్థానాలకు, ఆమ్ ఆద్మీ పార్టీ 59 సీట్లకు అభ్యర్థులను ప్రకటించాయి.