News January 5, 2026

GDPలో దూసుకెళ్తున్నాం.. కానీ 40% సంపద 1% చేతుల్లోనే..

image

భారత్ ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. ఇది నిజమే. కానీ దేశంలో 40% సంపద కేవలం జనాభాలోని 1% ధనవంతుల చేతుల్లోనే ఉందని World Inequality Report-2026 వెల్లడించింది. 50% జనాభా కేవలం 3% సంపదను మాత్రమే కలిగి ఉన్నారు. దీన్నిబట్టి ఆర్థిక అసమానతలు తీవ్రంగా ఉన్నాయని తెలుస్తోంది. తలసరి ఆదాయం, జీవనప్రమాణం పెరిగితేనే అసలైన అభివృద్ధి అని నిపుణులు అంటున్నారు.

Similar News

News January 7, 2026

తూర్పు గోదావరి జిల్లాలో 60 పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

image

AP: రాజమహేంద్రవరంలోని GMC, GGHలో 60పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, డిప్లొమా( అనస్థీషియా టెక్నీషియన్, కార్డియాలజీ, మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్‌మెంట్& ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్, ECG), బీఎస్సీ, DMLT, BSc(MLT), ఇంటర్(ఒకేషనల్), CLISc ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 42ఏళ్లు. వెబ్‌సైట్: https://eastgodavari.ap.gov.in

News January 7, 2026

మనీషా పంచకం ఎందుకు చదవాలి?

image

మనల్ని మనం ప్రశ్నించుకోవడానికి, అహంకారాన్ని తొలగించుకోవడానికి మనీషా పంచకం చదవాలి. బాహ్య రూపం, కులాన్ని బట్టి మనిషిని అంచనా వేయడం అజ్ఞానమని, అందరిలో ఉన్న ఆత్మ చైతన్యం ఒకటేనని ఇది బోధిస్తుంది. సమదృష్టిని పెంపొందించుకోడానికి, సత్యం వైపు పయణించడానికి ఇవి మార్గదర్శకాలు. ‘నేను శరీరాన్ని కాదు, ఆత్మను’ అనే సత్యాన్ని గ్రహించిన రోజే మనిషికి సంపూర్ణ విముక్తి లభిస్తుందని శంకరాచార్యులు ఇందులో స్పష్టం చేశారు.

News January 7, 2026

యాషెస్.. ఎదురీదుతున్న ఇంగ్లండ్

image

యాషెస్ సిరీస్ చివరి టెస్టులో ఇంగ్లండ్ ఎదురీదుతోంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 302/8 స్కోర్ చేసింది. దీంతో 119 పరుగుల లీడ్ సాధించింది. యంగ్ బ్యాటర్ జాకోబ్ బెతల్ 142*, డకెట్ 42, బ్రూక్ 42, జేమీ స్మిత్ 26 రన్స్ చేశారు. చేతిలో 2 వికెట్లే ఉండగా చివరి రోజు ఆసీస్ బౌలింగ్‌ను ఎంత మేర తట్టుకుంటుందో వేచి చూడాలి. ఇప్పటికే 3-1 తేడాతో కంగారూలు సిరీస్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.