News March 22, 2025

GDP గ్రోత్: భారత్, చైనా భళా.. EU కంట్రీస్ డీలా

image

ఎకానమీ పరంగా ఆసియా దేశాలైన భారత్, చైనా రికార్డులు సృష్టిస్తుంటే ఐరోపా కంట్రీస్ డీలా పడ్డాయి. 2015-2025 మధ్యన అంటే దశాబ్ద కాలంలో బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ GDP వృద్ధిరేటు 6 నుంచి 14 శాతమే పెరగడం గమనార్హం. జన సంక్షోభం ఎదుర్కొంటున్న జపాన్‌దీ ఇదే పరిస్థితి. కొవిడ్, అనిశ్చితి, యుద్ధాలు, ట్రేడ్‌వార్స్ ఇందుకు కారణాలు. టాప్10 ఎకానమీస్‌లో బ్రెజిల్ అత్యల్పంగా 8% వృద్ధిరేటుతో $2.1T నుంచి $2.3Tకు చేరుకుంది.

Similar News

News October 22, 2025

నవీన్, సునీత నామినేషన్లకు ఆమోదం

image

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు నవీన్ యాదవ్, మాగంటి సునీత నామినేషన్లు ఆమోదం పొందాయి. తన నామినేషన్‌పై బీఆర్ఎస్ తప్పుడు అభ్యంతరాలు వ్యక్తం చేసిందని నవీన్ తెలిపారు. అన్నీ సక్రమంగా ఉండటంతో ఆర్వో ఆమోదించినట్లు చెప్పారు. తాను మాత్రం ఎవరి నామినేషన్‌పై అభ్యంతరం చేయలేదని వెల్లడించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో భారీగా నామినేషన్లు దాఖలు కావడంతో స్క్రూటినీకి మరింత సమయం పట్టనుంది.

News October 22, 2025

పట్టణాలు, నగరాల్లో ఇక కామన్ జోనింగ్ విధానం

image

AP: రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల్లో జోనింగ్ నిబంధనలు ఒకేమాదిరి కాకుండా వేర్వేరుగా ఉన్నాయి. దీనివల్ల లైసెన్సులు, నిర్మాణ అనుమతులు ఇతర అంశాలలో సమస్యలు ఎదురవుతున్నాయి. దీని నివారణకు ప్రభుత్వం కామన్ జోనింగ్ విధానాన్ని ప్రవేశపెడుతూ తాజాగా <>GO216 <<>>ఇచ్చింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భాగంగా భారం తగ్గింపు, నిబంధనల సరళీకరణ, sasci ఇన్సెంటివ్‌లు పొందేందుకు వీలుగా కామన్ జోనింగ్‌ను పెడుతున్నట్లు వివరించింది.

News October 22, 2025

రానున్న 5 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు!

image

AP: నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం వల్ల రేపు ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. రానున్న 5 రోజులు రాష్ట్రంలో విస్తృతంగా పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. తీరం వెంబడి 35-55km/h వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. శనివారం వరకు జాలర్లు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.