News April 5, 2024

‘2047 నాటికి 8శాతానికి జీడీపీ’.. తమ అంచనా కాదన్న IMF

image

భారత జీడీపీ 2047 నాటికి 8శాతానికి చేరుతుందన్న IMF ప్రతినిధి కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యం అంచనాలపై ఆ సంస్థ వివరణ ఇచ్చింది. ఈ వ్యాఖ్యలు IMF భారత ప్రతినిధి హోదాలో చేసినవిగా వర్తిస్తాయని.. అది సంస్థ అభిప్రాయం కాదని స్పష్టం చేసింది. ప్రపంచ ఆర్థిక పరిస్థితిపై మరో రెండు వారాల్లో నివేదిక రిలీజ్ చేస్తామంది. కాగా గత పదేళ్లలో చేసినట్లు సంస్కరణలు కొనసాగిస్తే GDP 8శాతానికి చేరుతుందని కృష్ణమూర్తి పేర్కొన్నారు.

Similar News

News September 18, 2025

మంచిర్యాల: ‘పట్టు పురుగుల పెంపకాన్ని ప్రోత్సహించాలి’

image

ఆదివాసీల అభివృద్ధికి, పట్టు పురుగుల పెంపకానికి ప్రభుత్వం తరఫున ప్రోత్సాహం అందించాలని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మంచిర్యాల జిల్లాలో పట్టు పురుగుల పెంపకంపై సచివాలయంలో సంబంధిత అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. నాయక్ పోడు హక్కుల పరిరక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు రాజన్న, జిల్లా అధ్యక్షుడు పెద్ది భార్గవ్, తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షుడు శేఖర్, రైతులు తదితరులు ఉన్నారు.

News September 18, 2025

జూబ్లీ బైపోల్.. ఢిల్లీలో పైరవీలు!

image

TG: జూబ్లీహిల్స్ కాంగ్రెస్ టికెట్‌ కోసం ఢిల్లీలో భారీ లాబీయింగ్ జరుగుతోంది. ముఖ్యంగా దానం నాగేందర్ ఢిల్లీతో పాటు బెంగళూరుకు చక్కర్లు కొడుతున్నారు. హస్తిన నేతలతో పాటు AICC చీఫ్ మల్లికార్జున ఖర్గే కుమారుడిని కలిసి బీఫాం కోరారని తెలుస్తోంది. అటు ఢిల్లీకి వెళ్లిన CM రేవంత్‌తో ఖర్గే తనయుడు ఈ అంశంపై కాసేపటి క్రితం భేటీ అయినట్లు పార్టీ వర్గాల సమాచారం. ఖర్గేతో రేపు ఉదయం రేవంత్ సమావేశం కానున్నారు.

News September 18, 2025

నేను అన్ని మతాలను విశ్వసిస్తా: CJI గవాయ్

image

హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడారంటూ వస్తున్న విమర్శలపై CJI గవాయ్ స్పందించారు. ‘నేను అన్ని మతాలను విశ్వసిస్తా, గౌరవిస్తా. నా వ్యాఖ్యల్ని SMలో తప్పుగా చూపించారు’ అని అన్నారు. ఖజురహోలో ధ్వంసమైన విష్ణువు విగ్రహ పునర్నిర్మాణానికి ఆదేశాలివ్వాలని దాఖలైన పిటిషన్‌ను ఇటీవల SC తిరస్కరించింది. ఈ సందర్భంగా ‘ASIని సంప్రదించండి లేదా ఏదైనా చేయమని దేవుడినే వేడుకోండి’ అని ఆయన వ్యాఖ్యానించారు.