News March 15, 2025
GDWL: అన్నం ఇరుక్కుని వృద్ధురాలు మృతి

గొంతులో అన్నం ఇరుక్కొని ఓ వృద్దురాలు మృతి చెందిన ఘటన మల్దకల్ మండలం అమరవాయిలో జరిగింది. స్థానికులు వివరాలు.. అమరవాయికి చెందిన శాంతమ్మ(75) రోజు ఇంటి పనులు చేస్తూ ఉండేది. శుక్రవారం హోలీ ఉండటంతో ఇంటి వద్ద భోజనం చేస్తుండగా అన్నం ముద్ద గొంతులో ఇరుక్కుని అస్వస్థతకు గురైంది. గద్వాల ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతురాలికి ఇద్దరు కుమారులు, కుమార్తెలు ఉన్నారు.
Similar News
News November 24, 2025
పెద్దపల్లి: ‘కార్మికులు ఈ-శ్రమ్ పోర్టల్లో నమోదు చేసుకోవాలి’

కార్మిక సామాజిక భద్రత పథకాలపై అవగాహన సదస్సుల పోస్టర్ అదనపు కలెక్టర్ దాసరి వేణు కలెక్టరేట్లో ఆవిష్కరించారు. ఈ-శ్రమ్ పోర్టల్ లో నిర్మాణ కార్మికులు తమ పేరు నమోదు చేసుకోవాలన్నారు. నవంబర్ 24 నుంచి డిసెంబర్ 3 వరకు కార్మిక సంక్షేమంపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సదస్సుల కోసం పెద్దపల్లి 9492555258, మంథని 9492555248, గోదావరిఖని 9492555284 కార్మిక అధికారులను సంప్రదించాలని సూచించారు.
News November 24, 2025
కామరెడ్డి: చెక్కులు ఇచ్చింది వీళ్లకే..!

విధి నిర్వహణలో రోడ్డు ప్రమాదాల్లో మరణించిన ఇద్దరు కానిస్టేబుళ్ల కుటుంబాలకు KMR ఎస్పీ రాజేష్ చంద్ర భరోసా కల్పించిన విషయం తెలిసిందే. గాంధారి PSకు చెందిన కానిస్టేబుల్ వడ్ల రవికుమార్, పిట్లం PSకు చెందిన కె. బుచ్చయ్య మృతిచెందారు. SBI పోలీస్ సాలరీ ప్యాకేజ్ స్కీమ్ కింద ఒక్కో కుటుంబానికి రూ.కోటి ఇన్సూరెన్స్ చెక్కులను SP అందజేశారు.
News November 24, 2025
KMR: ఆలయాలకు ‘ధూప దీప నైవేద్యం’

ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ చొరవతో, దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కామారెడ్డి జిల్లాలోని నాలుగు దేవాలయాలకు ‘ధూప దీప నైవేద్యం’ పథకాన్ని మంజూరు చేశారు. షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. చరిత్ర కలిగిన దేవాలయాలు నిర్వహణ లేక శిథిలమవుతున్నాయన్నారు. ఈ పథకం ద్వారా ఆలయాల్లో నిత్యం పూజలు జరిగేందుకు, అర్చకుల పోషణకు ప్రభుత్వం సహాయం అందిస్తుందని తెలిపారు. అర్చకుల ఖాతాలో నేరుగా జమ చేస్తామని చెప్పారు.


