News March 8, 2025
GDWL: ఈనెల 31లోగా చేసుకుంటే 25శాతం రాయితీ: కలెక్టర్

అనధికార లేఅవుట్ల క్రమబద్ధీకరణను ఈనెల 31లోగా చేసుకుంటే 25% రాయితీ ఉంటుందని.. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకునే విధంగా సంబంధిత అధికారులు అవగాహన కల్పించాలని గద్వాల కలెక్టర్ సంతోష్ సూచించారు. శుక్రవారం ఐడీఓసీ మందిరంలో లేఅవుట్ క్రమబద్ధీకరణపై సమావేశం నిర్వహించారు. LRS కోసం జిల్లాలో 46,739 దరఖాస్తులు స్వీకరించగా 14,241 దరఖాస్తులను L1 అధికారులు పరిశీలించి క్రమబద్ధీకరణ చేసుకోవాలని సూచించారని చెప్పారు.
Similar News
News October 22, 2025
TG న్యూస్ రౌండప్

☛ రాష్ట్రంలోని అన్ని ట్రాన్స్పోర్ట్ చెక్ పోస్టులు సా.5గంటల లోపు మూసేయాలని రవాణాశాఖ కమిషనర్ ఆదేశాలు
☛ నల్గొండ: మైనర్పై అత్యాచారం కేసు.. నిందితుడు చందుకు 32ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ పోక్సో కోర్టు తీర్పు
☛ రెండేళ్లలో ఉస్మానియా నూతన ఆస్పత్రి నిర్మాణం పూర్తి చేయాలి: ఉన్నతాధికారులతో సమీక్షలో సీఎం రేవంత్ ఆదేశాలు
News October 22, 2025
KPHBలో ఫ్రెండ్స్తో డిన్నర్.. యువకుడి మృతి

ఫ్రెండ్స్తో డిన్నర్ చేయడానికి వెళ్లిన యువకుడు అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన ఘటన KPHB PS పరిధిలో చోటుచేసుకుంది. భవన్ కుమార్(24) KPHB రోడ్డు 3లో గణేష్ హాస్టల్లో నివాసం ఉంటూ జాబ్ చేస్తున్నాడు. 21వ తేదీన 8 గంటల సమయంలో PNR ఎంపైర్ భవనంలో తినడానికి వెళ్లి ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయాడు. వెంటనే స్నేహితులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News October 22, 2025
పలు రైళ్లు రాకపోకల ఆలస్యం: SCR

ఢిల్లీ నుంచి తెలంగాణ మీదుగా ప్రయాణించే పలు రైళ్ల రాకపోకలు ఆలస్యంగా నేడు నడవనున్నట్లు SCR పేర్కొంది. T. No.22692 నిజాముద్దీన్ – KSR బెంగళూరు రాజధాని రైలు 6 గంటలు, T.No. 20806 న్యూ ఢిల్లీ – విశాఖపట్నం ఆంధ్ర ప్రదేశ్ SF 8.30 గంటలు, T.No.12626 న్యూ ఢిల్లీ – త్రివేండ్రం కేరళ SF 10.25 గంటలు, T.No.12622 న్యూ ఢిల్లీ – చెన్నై తమిళనాడు SF 10.40 గంటలు నిన్న బయలుదేరిన రైలు బుధవారం ఆలస్యంగా నడుస్తుందన్నారు.