News March 8, 2025
GDWL: ఈనెల 31లోగా చేసుకుంటే 25శాతం రాయితీ: కలెక్టర్

అనధికార లేఅవుట్ల క్రమబద్ధీకరణను ఈనెల 31లోగా చేసుకుంటే 25% రాయితీ ఉంటుందని.. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకునే విధంగా సంబంధిత అధికారులు అవగాహన కల్పించాలని గద్వాల కలెక్టర్ సంతోష్ సూచించారు. శుక్రవారం ఐడీఓసీ మందిరంలో లేఅవుట్ క్రమబద్ధీకరణపై సమావేశం నిర్వహించారు. LRS కోసం జిల్లాలో 46,739 దరఖాస్తులు స్వీకరించగా 14,241 దరఖాస్తులను L1 అధికారులు పరిశీలించి క్రమబద్ధీకరణ చేసుకోవాలని సూచించారని చెప్పారు.
Similar News
News March 26, 2025
Stock Markets: ₹4లక్షల కోట్లు ఆవిరి

స్టాక్‌మార్కెట్లు భారీగా నష్టపోయాయి. నిఫ్టీ 23,486 (-181), సెన్సెక్స్ 77,288 (-728) వద్ద ముగిశాయి. ₹4L CR మదుపరుల సంపద ఆవిరైంది. మీడియా, రియాల్టి, హెల్త్‌కేర్, చమురు, PSE, PSU బ్యాంకు, IT, ఫైనాన్స్, ఫార్మా, కమోడిటీస్, PVT బ్యాంకు, ఎనర్జీ షేర్లు విలవిల్లాడాయి. ఇండస్‌ఇండ్, ట్రెంట్, హీరోమోటో, గ్రాసిమ్, పవర్ గ్రిడ్ టాప్ గెయినర్స్. NTPC, TECH M, సిప్లా, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంకు టాప్ లూజర్స్.
News March 26, 2025
KMR: పదో తరగతి పరీక్షలకు 26 మంది గైర్హాజరు

కామారెడ్డి జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని DEO రాజు పేర్కొన్నారు. బుధవారం గణితం పరీక్ష జరగ్గా.. 12,579 విద్యార్థులకు 12,553 మంది పరీక్ష రాయగా, 26 మంది పరీక్షకు హాజరు కాలేదని ఆయన వివరిచారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా అన్ని పరీక్షా కేంద్రాల్లో సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. కాగా దేవునిపల్లిలోని పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
News March 26, 2025
చిరంజీవితో సినిమాపై అనిల్ రావిపూడి ట్వీట్

మెగాస్టార్ చిరంజీవితో సినిమాపై దర్శకుడు అనిల్ రావిపూడి అప్డేట్ ఇచ్చారు. ఫైనల్ స్క్రిప్ట్ పూర్తయిందని ట్వీట్ చేశారు. ‘చిరంజీవి గారికి నా కథలో పాత్ర “శంకర్ వరప్రసాద్” ని పరిచయం చేశాను. ఆయనకు కథ నచ్చింది. త్వరలో ముహూర్తంతో చిరునవ్వుల పండగబొమ్మకి శ్రీకారం’ అని పేర్కొన్నారు. ఉగాదికి షూటింగ్ మొదలుపెడతారని సమాచారం.