News March 7, 2025
GDWL: దివ్యాంగులకు యూనిక్ డిజబిలిటీ కార్డులు కేటాయించాలి: కలెక్టర్

దివ్యాంగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి దివ్యాంగుడికి సదరం సర్టిఫికెట్‌కు బదులుగా యూనిక్ డిజబిలిటీ ఐడీ కార్డును కేటాయించాలని గద్వాల కలెక్టర్ సంతోష్ పేర్కొన్నారు. ఐడీఓసీ మందిరంలో శుక్రవారం యూడీఐడీ కార్డుల జారీ విధానంపై నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఉద్యోగ, ఉపాధి, విద్య, పెన్షన్ల కోసం దేశవ్యాప్తంగా ప్రయోజనం పొందే విధంగా ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం యూడీఐడీ కార్డులు ఇవ్వాలన్నారు.
Similar News
News November 8, 2025
MP సాన సతీశ్‌పై CM చంద్రబాబు ఆగ్రహం!

AP: గన్నవరం విమానాశ్రయంలో WC విన్నర్ శ్రీ చరణికి స్వాగతం పలికే విషయంలో ప్రొటోకాల్ వివాదం నెలకొంది. విమానాశ్రయానికి మంత్రులు, శాప్, ACA ప్రతినిధులు వెళ్లారు. శ్రీ చరణి ఉన్న లాంజ్‌లోకి BCCI మాజీ చీఫ్ సెలెక్టర్ MSK ప్రసాద్‌ని ప్రోటోకాల్ పోలీసులు వెళ్లనివ్వలేదు. దీనిపై MSKతో CM మాట్లాడారు. MP, ACA సెక్రటరీ సానా సతీశ్‌పై CM ఆగ్రహించినట్లు సమాచారం. ఇలాంటివి రిపీటవ్వకుండా చూసుకోవాలని ACAను ఆదేశించారు.
News November 8, 2025
నవంబర్ 8: చరిత్రలో ఈరోజు

1948: గాంధీని హత్య చేసినట్లు అంగీకరించిన గాడ్సే
2016: పాత రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన కేంద్రం
1656: తోకచుక్కను కనుగొన్న సైంటిస్ట్ ఎడ్మండ్ హేలీ జననం
1927: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ జననం
1969: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జననం
1977: డైరెక్టర్ బీఎన్ రెడ్డి మరణం
2013: కమెడియన్ ఏవీఎస్ మరణం
News November 8, 2025
హోంగార్డుల సంక్షేమానికి కృషి: ఎస్పీ

హోంగార్డుల సంక్షేమానికి తాము కట్టుబడి ఉంటామని కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ స్పష్టం చేశారు. శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో ఉద్యోగ విరమణ పొందిన హోంగార్డులు పి. జాన్, సీహెచ్ భవానీలకు ‘చేయూత’ కింద రూ.6.55 లక్షల చెక్కులను ఎస్పీ అందజేశారు.


