News March 30, 2025

GDWL: నేడు, రేపు పనిచేయనున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు

image

ఆది, సోమవారం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు పనిచేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈమేరకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. LRS ఫీజు మార్చి31లోపు చెల్లించిన వారికి 25 శాతం రాయితీ వర్తిస్తుందని రిజిస్ట్రేషన్ శాఖ తొలుత ప్రకటించింది. అయితే 30, 31 సెలవుదినాలు కావడంతో చెల్లింపులు జరపలేకపోతున్నామని ప్రజల నుంచి విజ్ఞప్తులు రావడంతో 30, 31 సెలవులు రద్దు చేసినట్లు తెలిపారు.

Similar News

News December 9, 2025

పాడేరు: ‘మ్యూటేషన్, రీసర్వే ప్రక్రియ పూర్తి చేయాలి’

image

రీసర్వే, మ్యూటేషన్ ప్రక్రియలో అలసత్వం చేయకుండా చూడాలని కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌ నుంచి వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. డీ పట్టా భూమి, ఆర్ఓఎఫ్ఆర్ భూమి, జిరాయితీ భూమిలో పంట పండించే ప్రతి రైతుకు అన్నదాత సుఖీభవ పథకం అందేలాగా చూడాలని సూచించారు. రీసర్వే చేసినప్పుడు ప్రభుత్వ భూములు, D-పట్టా భూమి పూర్తిగా పరిశీలించి వెబ్ల్యాండ్ సబ్ డివిజన్ చేయాలన్నారు.

News December 9, 2025

ఈవీఎం గోదాంను తనిఖీ చేసిన కలెక్టర్ రాహుల్ శర్మ

image

భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద గల ఎన్నికల ఈవీఎం గోదాంను కలెక్టర్ రాహుల్ శర్మ మంగళవారం పలు రాజకీయ పార్టీల నాయకులతో కలిసి తనిఖీ చేశారు. సాధారణ తనిఖీలో భాగంగానే దీనిని పరిశీలించినట్లు కలెక్టర్ తెలిపారు. గోదాంకు పటిష్ట భద్రత కల్పించాలని, నిరంతరం సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. తనిఖీ అనంతరం ఆయన లాక్ బుక్‌లో సంతకం చేశారు.

News December 9, 2025

పీకల్లోతు కష్టాల్లో భారత్

image

కటక్ వేదికగా సౌతాఫ్రికాతో తొలి T20లో భారత్ 3 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన IND మూడో బంతికే వైస్ కెప్టెన్ గిల్(4) వికెట్ కోల్పోయింది. కెప్టెన్ సూర్య కుమార్(12) కూడా ఎంగిడి బౌలింగ్‌లోనే గిల్ తరహాలో క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరారు. అభిషేక్(17) దూకుడుకు బౌలర్ సిపామ్లా బ్రేకులేశారు. IND స్కోర్ 7 ఓవర్లలో 50/3.