News March 30, 2025

GDWL: శిక్షణకు వచ్చి IPS అధికారి మృతి

image

హైదరాబాద్-శ్రీశైలం హైవేపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహారాష్ర్టకు చెందిన IPS అధికారి సుధాకర్‌తో పాటు ఆయన బంధువు కిషన్ రావు మృతి చెందారు. వారం రోజుల ప్రత్యేక శిక్షణ నిమిత్తం హైదరాబాద్ పోలీస్ అకాడమీకి వచ్చారు. శ్రీశైలానికి వెళ్లగా నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలో ఆర్టీసీ బస్సు కారును ఢీకొట్టింది. చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో వారు మృతి చెందారు.

Similar News

News December 2, 2025

ఖమ్మం: తొలిరోజే రూ.33 కోట్ల మద్యం విక్రయాలు

image

2025–27 ఎక్సైజ్ సంవత్సరానికి సంబంధించి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 204 వైన్ షాపుల్లో సోమవారం నుంచి మద్యం విక్రయాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజే వైరా ఐఎంఎల్ డిపో నుంచి ఏకంగా రూ.33 కోట్ల విలువైన మద్యం సరఫరా చేశారు. ఇందులో 38,685 మద్యం కేసులు, 17,298 బీరు కేసులు ఉన్నాయి. నెల రోజులుగా బ్రాండ్లు లేక ఇబ్బంది పడిన మద్యం ప్రియులకు అన్ని రకాలు అందుబాటులోకి వచ్చాయి.

News December 2, 2025

తిరిగి విధుల్లోకి ఏఆర్‌ కానిస్టేబుల్ ప్రకాశ్‌

image

వైసీపీ ప్రభుత్వంలో ఉద్యోగం కోల్పోయిన ఏఆర్‌ కానిస్టేబుల్‌ ప్రకాశ్‌ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఉత్తర్వులు ఇచ్చారు. ఆ ఆర్డర్స్‌ తీసుకున్న ఆయన సోమవారం అనంతపురం ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. ఎస్పీ జగదీశ్ ఆదేశాలతో తిరిగి విధుల్లో చేరనున్నట్లు ప్రకాశ్ తెలిపారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

News December 2, 2025

ఖమ్మం: చెక్ బౌన్స్.. ఏడాది జైలు, రూ.19 లక్షల పరిహారం

image

ఖమ్మం నర్తకి థియేటర్ ప్రాంతానికి చెందిన ఎ.రవిబాబుకి చెల్లని చెక్కు కేసులో ఖమ్మం రెండో అదనపు కోర్టు న్యాయాధికారి ఏపూరి బిందు ఏడాది జైలు శిక్షతో పాటు ఫిర్యాదుదారుడికి రూ.19 లక్షల నష్టపరిహారం చెల్లించాలని సోమవారం తీర్పు చెప్పారు. 2014లో రూ.15 లక్షల అప్పు తీసుకున్న నిందితుడు, 2016లో రూ.19 లక్షల చెక్కు జారీ చేయగా ఖాతాలో సరైన నగదు లేకపోవడంతో కోర్టులో కేసు దాఖలు చేయగా పైవిధంగా తీర్పునిచ్చారు.