News March 15, 2025

GDWL: అన్నం ఇరుక్కుని వృద్ధురాలు మృతి

image

గొంతులో అన్నం ఇరుక్కొని ఓ వృద్దురాలు మృతి చెందిన ఘటన మల్దకల్ మండలం అమరవాయిలో జరిగింది. స్థానికులు వివరాలు.. అమరవాయికి చెందిన శాంతమ్మ(75) రోజు ఇంటి పనులు చేస్తూ ఉండేది. శుక్రవారం హోలీ ఉండటంతో ఇంటి వద్ద భోజనం చేస్తుండగా అన్నం ముద్ద గొంతులో ఇరుక్కుని అస్వస్థతకు గురైంది. గద్వాల ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతురాలికి ఇద్దరు కుమారులు, కుమార్తెలు ఉన్నారు.

Similar News

News March 2, 2026

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం.. అనంతపురంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

image

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో అనంతపురం జిల్లాలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. కలెక్టరేట్‌తోపాటు అనంతపురం, కళ్యాణదుర్గం, గుంతకల్లు RDO కార్యాలయాల్లో ఈ నంబర్లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. యుద్ధ ప్రాంతాల్లో చిక్కుకున్న జిల్లా వాసుల సమాచారం కోసం బంధువులు 8500292992 నంబర్‌ను సంప్రదించవచ్చు.
★ అనంతపురం: 9493188818
★ కళ్యాణదుర్గం: 8309598111
★ గుంతకల్లు: 9866646648

News March 2, 2026

నిద్రలేవగానే కాళ్లు, చేతులూ వణుకుతున్నాయా?

image

నిద్రలేవగానే కొందరికి శరీరంలోని కండరాలు.. ముఖ్యంగా చేతులు, కాళ్లు వణికినట్టు అనిపిస్తుంది. బ్లడ్ షుగర్ లెవల్స్ పడిపోయినా, అతిగా కెఫిన్ (కాఫీ/టీ) తీసుకుంటున్నా, ఆందోళన/ఒత్తిడి ఎక్కువైనా, డీహైడ్రేషన్‌కు గురైనా ఇలా అనిపిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ లక్షణం కనిపిస్తే జాగ్రత్తలు తీసుకోవాలని.. అవసరమైతే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. సరిపడా నిద్రలేకపోయినా ఇలా అవుతుందని చెబుతున్నారు.

News March 2, 2026

కందికొండ శివారులో పెద్దపులి సంచారం..!

image

మహబూబాబాద్ జిల్లా సిరోల్ మండలంలోని కందికొండ శివారులో పెద్ద పులి సంచరించిన ఆనవాళ్లు కనిపించాయి. పంట చేలల్లో గుర్తించిన పులి పాద ముద్రలను అటవీ శాఖ అధికారులు పరిశీలించారు. పరిసర ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా బయటకు వెళ్లవద్దని గ్రామస్థులకు సూచించారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. కాగా, ఇటీవల జనగామ జిల్లాలో సైతం సంచరించిన విషయం తెలిసిందే.