News March 8, 2025

GDWL: ఈనెల 31లోగా చేసుకుంటే 25శాతం రాయితీ: కలెక్టర్ 

image

అనధికార లేఅవుట్ల క్రమబద్ధీకరణను ఈనెల 31లోగా చేసుకుంటే 25% రాయితీ ఉంటుందని.. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకునే విధంగా సంబంధిత అధికారులు అవగాహన కల్పించాలని గద్వాల కలెక్టర్ సంతోష్ సూచించారు. శుక్రవారం ఐడీఓసీ మందిరంలో లేఅవుట్ క్రమబద్ధీకరణపై సమావేశం నిర్వహించారు. LRS కోసం జిల్లాలో 46,739 దరఖాస్తులు స్వీకరించగా 14,241 దరఖాస్తులను L1 అధికారులు పరిశీలించి క్రమబద్ధీకరణ చేసుకోవాలని సూచించారని చెప్పారు.

Similar News

News November 7, 2025

సిద్ధవటం: అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య

image

అప్పుల బాధతో కౌలు రైతు వెంకట నరసారెడ్డి(60) ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. ఒంటిమిట్ట మండలం తప్పెటవారిపల్లికి చెందిన వెంకటనరసారెడ్డికి పంటలు చేతికి అందక రూ.40 లక్షల అప్పులయ్యాయి. ఆ బాధతో పురుగు మందు తాగి APSP 11వ బెటాలియన్ వెనుకవైపు ఉన్న పొలాల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య కుమారి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

News November 7, 2025

గచ్చిబౌలి: ఫుడ్ ప్రాసెసింగ్‌పై టెక్నికల్ యూనిట్ కాన్ఫరెన్స్

image

గచ్చిబౌలి ప్రాంతంలో ఫుడ్ ప్రాసెసింగ్ అంశంపై టెక్నికల్ యూనిట్ కాన్ఫరెన్స్ జరిగింది. చైనా, రష్యా సహా ఇతర దేశాలకు చెందిన పలువురు నిపుణులు ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంపై పెట్టుబడులు లాభసాటిగా ఉన్నాయని, రోజురోజుకు డిమాండ్ పెరుగుతున్నట్లుగా FPUD డైరెక్టర్ సింగనాద్ జూరీ తెలిపారు.

News November 7, 2025

వనపర్తి: ‘బీజీలు సమర్పించిన మిల్లులకే ధాన్యం కేటాయింపు’

image

ఖరీఫ్ 2025-26 సీజన్‌కు సంబంధించి బ్యాంకు గ్యారంటీలు (బీజీ) సమర్పించిన రైస్ మిల్లులకే ధాన్యం కేటాయించడం జరుగుతుందని అదనపు కలెక్టర్ ఖీమ్య నాయక్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో మిల్లర్లతో ఆయన సమావేశమయ్యారు. అర్హత సాధించిన 80 మిల్లుల్లో కేవలం 18 మిల్లులు మాత్రమే బీజీలు సమర్పించాయని, మిగతా అర్హతగల మిల్లులన్నీ వెంటనే బీజీలు సమర్పించాలని ఆదేశించారు.