News March 30, 2025

GDWL: నేడు, రేపు పనిచేయనున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు

image

ఆది, సోమవారం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు పనిచేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈమేరకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. LRS ఫీజు మార్చి31లోపు చెల్లించిన వారికి 25 శాతం రాయితీ వర్తిస్తుందని రిజిస్ట్రేషన్ శాఖ తొలుత ప్రకటించింది. అయితే 30, 31 సెలవుదినాలు కావడంతో చెల్లింపులు జరపలేకపోతున్నామని ప్రజల నుంచి విజ్ఞప్తులు రావడంతో 30, 31 సెలవులు రద్దు చేసినట్లు తెలిపారు.

Similar News

News December 14, 2025

ఏంపేడు సర్పంచ్‌గా ఈసంపల్లి హారిక

image

టేకుమట్ల మండలంలోని ఏంపేడు పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్‌ అభ్యర్థి ఈసంపల్లి హారిక విజయం సాధించారు. తన ప్రత్యర్థిపై 64 ఓట్ల తేడాతో గెలుపొందారు.

News December 14, 2025

PGRS సేవలు వినియోగించుకోండి: కలెక్టర్

image

గుంటూరు కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక(PGRS) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. https://Meekosam.ap.gov.in వెబ్ సైట్ ద్వారా, నేరుగా అయినా అర్జీలు సమర్పించవచ్చని చెప్పారు. 1100 టోల్ ఫ్రీకి డయల్ చేసి అర్జీల స్థితినితెలుసుకోవచ్చని చెప్పారు. అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.

News December 14, 2025

రాజోలి: ఓట్ల లెక్కింపు ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

image

రాజోలి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలో లెక్కింపు ప్రక్రియను ఆదివారం కలెక్టర్ సంతోష్, ఎస్పీ శ్రీనివాసరావు పరిశీలించారు. కౌంటింగ్‌లో పారదర్శకత, కచ్చితత్వం అత్యంత ముఖ్యమని కలెక్టర్ అన్నారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ పత్రాలను లెక్కించి, తరువాత వార్డ్ మెంబర్ బ్యాలెట్ పేపర్లను వేరుచేసి క్రమపద్ధతిలో ఓట్లను లెక్కించాలని అధికారులను ఆదేశించారు.