News March 19, 2024
ఐఫోన్లలో జెమినీ ఏఐ!
జనరేటివ్ ఏఐ విభాగంలో మార్కెట్లో పోటీని తట్టుకునేలా యాపిల్ తన ప్రొడక్ట్‌లు అప్డేట్ చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలో యాపిల్, గూగుల్ మధ్య త్వరలో భారీ డీల్ జరగనున్నట్లు బ్లూమ్‌బర్గ్ నివేదిక తెలిపింది. ఐఫోన్లలో గూగుల్‌కి చెందిన జెమిని ఏఐ ఫీచర్స్‌ని అందుబాటులోకి తెచ్చేందుకు చర్చలు జరుగుతున్నట్లు పేర్కొంది. ఏఐ మోడల్‌ను ఐఫోన్ ఐఓఎస్ 18లో అందించేలా యాపిల్ కంపెనీ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పింది.
Similar News
News November 24, 2024
అలాంటి కాల్ వస్తే భయపడొద్దు!
అనుమానిత వస్తువుల కొరియర్ అంటూ, వీడియో కాల్ చేసి మహిళతో అసభ్యంగా ప్రవర్తించారని కేసు పెడతామని సైబర్ నేరగాళ్లు కాల్స్ చేస్తున్నట్లు AP పోలీసులు అప్రమత్తం చేస్తున్నారు. పోర్న్ సైట్లు చూస్తున్నారని, అరెస్ట్ చేయకుండా ఉండాలంటే ఫైన్ కట్టాలని కాల్ చేసి డబ్బులు దోచేస్తున్నట్లు చెబుతున్నారు. ఇలాంటి మోసాలపై 1930కి కాల్ చేయడంతో పాటు www.cybercrime.gov.inలో కంప్లైంట్ చేయాలని సూచిస్తున్నారు.
News November 24, 2024
ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు: శరద్ పవార్
మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి విజయంపై NCP(SP) చీఫ్ శరద్ పవార్ స్పందించారు. లాడ్కీ బహీణ్ పథకం, మతపరమైన విభజనలు, మహిళలు పెద్దఎత్తున పోలింగ్‌లో పాల్గొనడం ఆ కూటమి గెలుపునకు దోహదం చేసి ఉండొచ్చన్నారు. తాము గెలుపుకోసం మరింత కష్టపడాల్సిందని చెప్పారు. ఫలితాలు తాము అనుకున్నట్లు రాలేదని, వీటిపై అధ్యయనం చేసి ప్రజల్లోకి వెళ్తామని పేర్కొన్నారు.
News November 24, 2024
క్రికెట్ ప్రపంచం జైస్వాల్ కాళ్ల వద్ద ఉంది: గవాస్కర్
భారత ఓపెనింగ్ బ్యాటర్ యశస్వీ జైస్వాల్‌పై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ప్రశంసలు కురిపించారు. క్రికెట్ ప్రపంచం అతడి పాదాల వద్ద ఉందంటూ కొనియాడారు. ‘ఈ కుర్రాడు చాలా స్పెషల్. ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయికి చేరుకున్నాడు. సెంచరీ పూర్తైతే 150, 200 రన్స్ కొట్టాలని చూస్తాడు. ప్రపంచంలో ఏ దేశపు బౌలర్లకైనా చుక్కలు చూపిస్తాడు. ఈరోజు అతడి ఆటతీరే అందుకు నిదర్శనం’ అని పేర్కొన్నారు.