News December 30, 2024
ఇంకొక్కరోజులో జనరేషన్ బీటా వచ్చేస్తోంది

జనరేషన్ ఆల్ఫాకు రేపటితో గుడ్‌బై చెప్పనున్న మానవాళి కొత్త ఏడాదిలో జనరేషన్ బీటాకు స్వాగతం పలకనుంది. 2025-2039 మధ్య జన్మించే పిల్లలను ఇక నుంచి జనరేషన్ బీటాగా పరిగణిస్తారు. 2035 నాటికి ప్రపంచ జనాభాలో వీరు 16% ఉంటారని నిపుణులు అంచనా వేస్తున్నారు. విస్తృతమైన సాంకేతిక పరిజ్ఞానం, వసతులు వంటి సౌలభ్యాలతో వీరు 22వ శతాబ్దాన్ని కూడా చూస్తారని లెక్కలేస్తున్నారు.
Similar News
News January 9, 2026
ఘనంగా ముగిసిన వైకుంఠ ద్వార దర్శనాలు

AP: తిరుమలలో శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు గురువారం అర్ధరాత్రితో ఘనంగా ముగిశాయి. డిసెంబర్ 30న ప్రారంభమైన ఈ పవిత్ర దర్శనాలకు రికార్డు స్థాయిలో భక్తులు తరలివచ్చారు. 9 రోజుల్లోనే 7 లక్షల మందికి పైగా దర్శన భాగ్యం కలగగా, పదో రోజుతో ఈ సంఖ్య దాదాపు 8 లక్షలకు చేరనుంది. ఈ సందర్భంగా హుండీ కానుకలుగా రూ.36.86 కోట్లు లభించాయి. 37.97 లక్షల లడ్డూలు విక్రయించారు. 2.06 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.
News January 9, 2026
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News January 9, 2026
OTTలోకి కొత్త సినిమాలు

బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన ‘అఖండ-2’ ఈరోజు నుంచి Netflixలో 5 భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. అటు మురళీ మనోహర్ డైరెక్షన్లో నరేశ్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన ‘గుర్రం పాపిరెడ్డి’ ఈ నెల 16న ZEE5లోకి రానుంది. మరోవైపు శోభితా ధూళిపాళ్ల నటించిన ‘చీకటిలో’ సినిమా ఈ నెల 23న నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ కాబోతోంది. దీనికి శరత్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించారు.


