News October 5, 2024
ఇంగ్లండ్‌లో నవజాత శిశువులకు జన్యుపరీక్షలు.. ఎందుకంటే..

వందలాదిమంది నవజాత శిశువులకు ఇంగ్లండ్ జన్యుపరీక్షలు నిర్వహిస్తోంది. దీని ద్వారా జన్యుపరంగా తలెత్తే అరుదైన ఆరోగ్య సమస్యల్ని ముందుగా గుర్తించి తగిన చికిత్స అందించవచ్చని అక్కడి అధికారులు తెలిపారు. దీనికోసం బొడ్డుతాడు నుంచి జన్యువుల్ని సేకరిస్తారు. NHS, జెనోమిక్స్ ఇంగ్లండ్ సంస్థలు కలిసి ఈ కార్యక్రమం చేపట్టాయని, లక్షమంది శిశువులకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు.
Similar News
News January 25, 2026
H-1B షాక్.. ఇంటర్వ్యూలు 2027కి వాయిదా

అమెరికా H-1B వీసా దరఖాస్తుదారులకు భారీ షాక్ తగిలింది. ఇండియాలోని US కాన్సులేట్లలో బ్యాక్‌లాగ్స్ పెరగడంతో వీసా స్టాంపింగ్ అపాయింట్మెంట్లు 2027కి వాయిదా పడ్డాయి. హైదరాబాద్, ముంబై వంటి నగరాల్లో స్లాట్లు లేకపోవడంతో ఇప్పటికే ఇండియా వచ్చిన వారు ఇక్కడే చిక్కుకుపోయారు. ఇతర దేశాల్లో స్టాంపింగ్ చేసుకునే ఛాన్స్ కూడా లేకపోవడంతో ఉద్యోగాలు, కుటుంబాల విషయంలో ఆందోళన నెలకొంది.
News January 25, 2026
తగ్గనున్న BMW, ఫ్రెంచ్ వైన్ ధరలు?

భారత్-EU మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్‌కు సర్వం సిద్ధమైంది. ఈ నెల 27న జరిగే India-EU సమ్మిట్‌లో ఒప్పందం ఖరారు లాంఛనంగా కనిపిస్తోంది. అదే జరిగితే BMW, ఫోక్స్‌వ్యాగన్ వంటి ప్రీమియం కార్లు, ఫ్రెంచ్ వైన్ సహా అనేక ఉత్పత్తుల ధరలు తగ్గే అవకాశం ఉంది. అలాగే ఇండియా నుంచి టెక్స్టైల్స్, నగలు, కెమికల్స్, ఫార్మా వంటి ఎగుమతులు పెరుగుతాయి. ట్రంప్ టారిఫ్స్ నేపథ్యంలో EU మార్కెట్ భారత్‌కు కీలకం కానుంది.
News January 25, 2026
T20 WC.. ఏ గ్రూపులో ఏ జట్లు ఉన్నాయంటే?

ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న టీ 20 వరల్డ్ కప్‌లో పాల్గొనే జట్ల గ్రూపులను ICC ప్రకటించింది. భారత్, పాకిస్థాన్ గ్రూప్-Aలో ఉన్నాయి. బంగ్లాదేశ్ WC నుంచి తప్పుకోవడంతో గ్రూప్-Cలో దాని స్థానంలో స్కాట్లాండ్ను చేర్చారు. పై ఫొటోలో ఏ గ్రూపుల్లో ఏ జట్లు ఉన్నాయో చూడొచ్చు.


