News November 10, 2024
బంగ్లాలో నరమేధం: యూనస్‌పై ICCలో ఫిర్యాదు

బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ మహ్మద్ యూనస్‌పై ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు (ICC)లో అవామీ లీగ్ ఫిర్యాదు చేసింది. ఆయనతో పాటు క్యాబినెట్ మెంబర్స్, ADA స్టూడెంట్ లీడర్లు సహా 62 మంది పేర్లను చేర్చింది. షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయాక తమ పార్టీ వర్కర్స్, హిందువులు సహా మైనార్టీలపై నరమేధం జరిగిందని పేర్కొంది. సాక్ష్యాలుగా 800 పేజీల డాక్యుమెంట్‌ను సబ్మిట్ చేసింది. మరో 15000 ఫిర్యాదులకు సిద్ధమవుతోంది.
Similar News
News October 15, 2025
తెలంగాణ న్యూస్ రౌండప్

* బీసీ రిజర్వేషన్లపై ఈనెల 18న చేపట్టనున్న తెలంగాణ బంద్‌కు సీపీఐ, సీపీఎం, టీడీపీ, టీజేఎస్ మద్దతు
* ఈనెల 25న హుజూర్‌నగర్‌లో ప్రభుత్వ ఆధ్వర్యంలో మెగా జాబ్‌మేళా.. 10వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలే లక్ష్యంగా పాల్గొననున్న 150 కంపెనీలు
* నల్గొండలోని బొట్టుగూడ ప్రభుత్వ పాఠశాలకు మంత్రి కోమటిరెడ్డి కుమారుడు
ప్రతీక్ రెడ్డి పేరు పెడుతూ ప్రభుత్వం జీవో.. రూ.8 కోట్లతో భవనం నిర్మిస్తున్న మంత్రి.
News October 15, 2025
తిరుమల తరహాలో శ్రీశైలం అభివృద్ధికి ప్రణాళిక

AP: శ్రీశైల క్షేత్రాన్ని తిరుమల తరహాలో అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఘాట్ రోడ్ విస్తరణ, భక్తుల కోసం సౌకర్యాల ఏర్పాటు తదితర అభివృద్ధి పనులకు అటవీ శాఖ నుంచి అనుమతి రావాల్సి ఉంది. 3 దశల్లో డెవలప్మెంట్ పనులకు దాదాపు 4,900 ఎకరాల అటవీ భూములు అవసరం కానున్నాయి. ఈనెల 16న ప్రధాని మోదీ శ్రీశైలం రానున్న నేపథ్యంలో ఈ భూములపై నివేదిక అందజేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
News October 15, 2025
బియ్యప్పిండితో బ్యూటీ

విటమిన్-బి అధికంగా ఉండే బియ్యం చర్మ సమస్యలను తగ్గిస్తుంది. ఈ పిండితో చేసే బ్యూటీ మాస్క్లేంటో చూద్దాం. * స్పూన్ బియ్యం పిండి, ఎగ్ వైట్ వేసి కలపాలి. ఆ పేస్ట్‌ని ముఖానికి పట్టించి అరగంట తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ మాస్క్ ముఖంపై ముడతలను తగ్గిస్తుంది. * టమాటా రసం, గోధుమపిండి, బియ్యంపిండి కలిపి ముఖానికి పట్టించి పావుగంట తర్వాత కడిగేయాలి. దీంతో ముఖంపై మచ్చలు తొలగిపోతాయి.