News December 28, 2024

జర్మనీ పార్లమెంట్ రద్దు.. FEB 23న ఎలక్షన్స్

image

జర్మనీ అధ్యక్షుడు ఫ్రాంక్ వాల్టర్ అక్కడి పార్లమెంట్‌ను రద్దు చేశారు. ఫిబ్రవరి 23న ఎన్నికలు నిర్వహిస్తామని అధికారులు ప్రకటించారు. అప్పటి వరకు ఛాన్సలర్ ఓలాఫ్ షోల్జ్ తాత్కాలిక ప్రభుత్వం బాధ్యతలను నిర్వర్తించనున్నారు. ఇటీవల జరిగిన ఓటింగ్‌లో అక్కడి సంకీర్ణ ప్రభుత్వం పార్లమెంట్ విశ్వాసాన్ని కోల్పోయింది. 733 మంది సభ్యులున్న సభలో అనుకూలంగా 207, వ్యతిరేకంగా 394 మంది ఓట్లు వేశారు.

Similar News

News November 13, 2025

నాయీ బ్రాహ్మణులకు గుడ్ న్యూస్

image

AP: రాష్ట్రంలోని పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఆధ్వర్యంలోని కాంప్లెక్సుల్లో నాయీ బ్రాహ్మణులకు షాపులు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బీసీ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ నుంచి అందిన ప్రతిపాదనల మేరకు బీసీ సంక్షేమ శాఖ మెమో జారీచేసింది. 1996లోని GO-13లో పేర్కొన్న నిబంధనలను అనుసరించాలని కలెక్టర్లు, కార్పొరేషన్లు, మున్సిపల్ అధికారులకు సూచించింది.

News November 13, 2025

ఉసిరిలో కాయకుళ్లు, నల్లమచ్చ తెగుళ్ల నివారణ

image

కాయకుళ్లు తెగులు సోకిన ఉసిరి కాయలపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడి వాటి నుంచి చెడువాసన వస్తుంటుంది. దీని నివారణకు కాయలను నిల్వ ఉంచే ముందు 2 శాతం ఉప్పు ద్రావణంలో కానీ లేదా 1% బోరాక్స్ మిశ్రమంలో కానీ ముంచి తీయాలి. ఉసిరిలో నల్లమచ్చ తెగులు వల్ల కాయలపై నల్ల మచ్చలు చిన్నవిగా ఏర్పడి క్రమంగా పెద్దవి అవుతాయి. తెగులు కట్టడికి లీటరు నీటికి 3గ్రా. కాపర్ ఆక్సీక్లోరైడ్‌ను తొలకరి చినుకులు పడిన వెంటనే పిచికారీ చేయాలి.

News November 13, 2025

తాజా సినీ ముచ్చట్లు

image

⋆ కమల్ హాసన్ నిర్మాణంలో రజినీకాంత్ నటించబోయే సినిమా నుంచి అనివార్య కారణాలతో తప్పుకుంటున్నట్లు ప్రకటించిన డైరెక్టర్ సి.సుందర్
⋆ అట్లీ-అల్లు అర్జున్ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. మే నాటికి బన్నీ షూటింగ్ పూర్తవుతుంది: సినీ వర్గాలు
⋆ దుల్కర్ సల్మాన్, రానా, భాగ్యశ్రీ, సముద్రఖని నటించిన ‘కాంత’ సినిమాకు U/A సర్టిఫికెట్.. సినిమా నిడివి 2.40hrs.. రేపే థియేటర్లలో విడుదల