News February 1, 2025

తక్కువ వడ్డీతో రూ.5లక్షల రుణం.. ఇలా చేయండి

image

కిసాన్ క్రెడిట్ కార్డ్ పరిమితిని కేంద్రం రూ.3లక్షల నుంచి రూ.5లక్షలకు పెంచింది. కౌలు రైతులు, భూ యజమాని-సాగుదారులు, వాటాదారులు, వ్యవసాయం లేదా చేపలు పట్టడం లేదా పశుపోషణ వంటి లేదా డ్వాక్రా సభ్యులు ఈ కార్డు తీసుకునేందుకు అర్హులు. వడ్డీ కేవలం 4శాతం(7శాతంలో 3% కేంద్రం రాయితీ) ఉంటుంది. 5 ఏళ్ల కాలపరిమితి ఉంటుంది. దేశంలోని ఏ బ్యాంకులోనైనా కార్డు తీసుకోవచ్చు. రూ.2లక్షలలోపు రుణానికి పూచీకత్తు అవసరం లేదు.

Similar News

News September 16, 2025

యూసుఫ్ పఠాన్‌‌‌ను ఆక్రమణదారుడిగా పేర్కొన్న హైకోర్టు

image

ఆక్రమించిన ప్రభుత్వ స్థలాన్ని ఖాళీ చేయాలని మాజీ క్రికెటర్, MP యూసుఫ్ పఠాన్‌‌ను గుజరాత్ హైకోర్టు ఆదేశించింది. అతడిని ఆక్రమణదారుడిగా పేర్కొంది. సెలబ్రిటీలు చట్టానికి అతీతులు కారని చెప్పింది. వడోదరలో ఇంటి పక్కనున్న ఖాళీ స్థలాన్ని యూసుఫ్ ఆక్రమించగా 2012లో సర్కార్ నోటీసులిచ్చింది. తాను, తన సోదరుడు క్రికెటర్లమని, సెక్యూరిటీ దృష్ట్యా ఆ భూమిని కొనేందుకు అనుమతించాలని కోరగా హైకోర్టు తాజాగా తిరస్కరించింది.

News September 16, 2025

మాడ్యులర్ కిచెన్ చేయిస్తున్నారా?

image

మాడ్యులర్ కిచెన్‌కు ఈ రోజుల్లో ఆదరణ పెరుగుతోంది. అయితే కిచెన్‌కి వెంటిలేషన్ బాగా ఉండేలా చూసుకోవాలి. సరకులు పెట్టుకోవడానికి అల్మారా, డీప్ డ్రా నిర్మించుకోవాలి. చాకులు, స్పూన్‌లు, గరిటెలు విడివిడిగా పెట్టుకొనేలా ఉండాలి. అప్పుడే వస్తువులు నీట్‌గా కనిపిస్తాయి. కావాల్సిన వస్తువు వెంటనే చేతికి దొరుకుతుంది. వంటగదిలో ఎలక్ట్రానిక్ పరికరాలు వాడటానికి వీలుగా అవసరమైన చోట ప్లగ్ బోర్డ్స్ ఉండేలా చూసుకోవాలి.

News September 16, 2025

పాక్‌కు అవమానం.. మాట ప్రకారం తప్పుకుంటుందా?

image

IND vs PAK మ్యాచ్‌‌ రిఫరీ పైక్రాఫ్ట్‌ను తొలగించాలని PCB చేసిన <<17717948>>ఫిర్యాదును<<>> రిజెక్ట్ చేసినట్లు ICC అధికారికంగా ప్రకటించింది. దీంతో ఆయనపై చర్యలు తీసుకోకపోతే ఆసియా కప్‌ నుంచి తప్పుకుంటామన్న పాక్‌‌కు ఘోర అవమానం ఎదురైంది. మొన్న గ్రౌండ్లో ప్లేయర్లకు, ఇప్పుడు ఆ దేశ బోర్డుకు భంగపాటు తప్పలేదు. మాట మీద నిలబడి టోర్నీ నుంచి తప్పుకుంటే పాక్‌కు కనీస మర్యాదైనా దక్కుతుందేమోనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.