News May 13, 2024

GET READY తూ.గో. జిల్లా

image

సార్వాత్రిక ఎన్నికల పోలింగ్ నేడే కావడంతో ఉమ్మడి తూ.గో. జిల్లాలోని 19 నియోజకవర్గాలు, 3 ఎంపీ స్థానాలకు సంబంధించి పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు. ఓటర్ల ఇబ్బంది లేకుండా ఆయా పోలింగ్‌ బూత్‌ల వద్ద షామియానాలు, నీటి సదుపాయం, వృద్ధులు, దివ్యాంగులకు ర్యాంపులు తదితర సౌకర్యాలు ఏర్పాటుచేశారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది.
– ఓటేద్దాం.. హక్కును రక్షించుకుందాం.

Similar News

News March 12, 2026

రాజమండ్రిలో అక్రమాల డొంక లాగుతున్న ACB

image

రాజమండ్రి కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ విభాగంలో రెండు రోజులుగా ACB అధికారులు చేపట్టిన తనిఖీలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అక్రమ నిర్మాణాలు, అనధికార లేఅవుట్లపై ఏసీబీ డీఎస్పీ కిషోర్ కుమార్ బృందం లోతుగా దర్యాప్తు చేస్తోంది. కార్యాలయంలోని సుమారు 700 పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన అధికారులు, పలు కీలక పత్రాలను సీజ్ చేశారు. గురువారం నగరవ్యాప్తంగా ACB బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి తనిఖీలు నిర్వహించనుంది.

News March 10, 2026

రాజమండ్రిలో HPV వ్యాక్సినేషన్ పోస్టర్ ఆవిష్కరణ

image

గర్భాశయ క్యాన్సర్ నివారణకు 14 ఏళ్ల బాలికలకు ఒక డోసు HPV వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు జేసీ వై.మేఘా స్వరూప్ తెలిపారు. సోమవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఈ వ్యాక్సినేషన్ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ కార్యక్రమం చేపట్టాయని, విద్యాశాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ సమన్వయంతో దీనిని విజయవంతం చేయాలని ఆయన కోరారు.