News November 17, 2024

GET READY: సాయంత్రం 6.03 గంటలకు

image

దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-2’ ట్రైలర్ ఇవాళ విడుదల కానుంది. బిహార్ పట్నాలో జరగనున్న ఈవెంట్‌లో సాయంత్రం 6.03 గంటలకు ట్రైలర్‌ను లాంచ్ చేయనున్నారు. పుష్ప-1 బ్లాక్‌బస్టర్‌ హిట్ కావడంతో పుష్ప-2పై భారీ అంచనాలున్నాయి. మరి మీరూ ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్నారా?

Similar News

News December 2, 2025

PCOSని తగ్గడానికి ఏం చేయాలంటే?

image

మంచి జీవనశైలిని పాటిస్తూ ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకున్నారంటే పీసీఓఎస్ అదుపులోకి వస్తుందని.. అప్పుడు గర్భం ధరించే అవకాశం పెరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. డైలీ శారీరక శ్రమ, తగినంత నిద్రతో పాటు రోజూ ఒకే సమయానికి ఆహారం తినడం కూడా కీలకం. ముఖ్యంగా విటమిన్ బి ఉన్న ఆహారాలు తీసుకోవాలి. కొందరిలో ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌ ఉన్నప్పటికీ బరువు కంట్రోల్​లోనే ఉంటుంది. దీన్ని లీన్‌ పీసీఓఎస్‌ అంటారు.

News December 2, 2025

PCOS ఉంటే వీటికి దూరంగా ఉండాలి

image

PCOS ఉన్నవారు బెల్లం, పంచదార, తేనె, తీపి, మైదా, బేకరీ ఆహార పదార్థాలకు వీలైనంత దూరంగా ఉండేలా చూసుకోవాలంటున్నారు నిపుణులు. 1.5 శాతం మాత్రమే కొవ్వు ఉండే పాలు, పెరుగు తీసుకోవాలి. వంటల్లో నూనె తక్కువ ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. ఇవన్నీ క్రమం తప్పకుండా పాటించడం వల్ల PCOS, ఇన్సులిన్‌ స్థాయులు అదుపులోకి వస్తాయి. దీంతో గర్భం ధరించే అవకాశాలు పెరుగుతాయని నిపుణులు సూచిస్తున్నారు.

News December 2, 2025

ఇవాళ ఢిల్లీకి రేవంత్

image

TG: సీఎం రేవంత్‌ ఇవాళ రాత్రి ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు ప్రధాని మోదీతో సమావేశమై రాష్ట్రంలో ఈ నెల 8, 9న జరిగే గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానించనున్నారు. దీంతో పాటు పలువురు కేంద్రమంత్రులు, AICC నేతలను ఆయన ఇన్వైట్ చేయనున్నారు. మరోవైపు ఇవాళ మధ్యాహ్నం ప్రజాపాలన ఉత్సవాల్లో భాగంగా ఉమ్మడి ఖమ్మంలోని కొత్తగూడెంలో జరిగే కార్యక్రమంలో CM పాల్గొంటారు. జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు.