News April 6, 2024
GET READY.. సాయంత్రం 6 గంటలకు..

కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఇండియన్-2’. ‘భారతీయుడు’కి సీక్వెల్‌గా వస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ క్రేజీ ట్వీట్ చేసింది. ఇవాళ సాయంత్రం 6 గంటలకు అదిరిపోయే అప్డేట్ ఇవ్వనున్నట్లు పేర్కొంది. అవినీతికి వ్యతిరేకంగా అందరం నిలబడదామని పేర్కొంది.
Similar News
News November 20, 2025
మరోసారి అతిరథ మహారథులతో మెరిసిపోనున్న నగరం

భారతీయ కళా మహోత్సవం సెకండ్ ఎడిషన్‌కు రాష్ట్రపతి నిలయం వేదికకానుంది. 22- 30వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు కొనసాగనున్నాయి. ఈ మహోత్సవ్‌లో పశ్చిమ రాష్ట్రాలైన మహరాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, గోవాలతో పాటు డామన్& డయ్యూ, దాద్రానగర్ హవేలీకి చెందిన ప్రదర్శనలు ఉంటాయి. ఆయా రాష్ట్రాలకు చెందిన వందలాది మంది కళాకారులు HYD రానున్నారు. కాగా, రేపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించనున్నారు.
News November 20, 2025
స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.170 తగ్గి రూ.1,24,690కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.150 పతనమై రూ.1,14,300 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.3,000 తగ్గి రూ.1,73,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News November 20, 2025
బొప్పాయి కోత, రవాణాలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

బొప్పాయిని దూరంగా ఉండే మార్కెట్లకు పంపాలంటే వాటిపై ఆకుపచ్చ రంగు నుంచి 1,2 పసుపు చారలు రాగానే కోయాలి. దగ్గరి మార్కెట్లలో విక్రయించాలంటే కొంచెం మాగిన కాయలను కోయాలి. బొప్పాయిని కోశాక పాలు ఆరేవరకు నీడలో ఉంచాలి. లేకుంటే కాయలపై మచ్చలు పడి నాణ్యత దెబ్బతింటుంది. కాయలకు విడివిడిగా న్యూస్ పేపర్ చుట్టి ప్యాకింగ్ చేయాలి. బొప్పాయి రవాణా చేసే వాహనాల అడుగున, పక్కల వరిగడ్డి పరిస్తే నాణ్యత దెబ్బతినకుండా ఉంటుంది.


