News December 16, 2024
GET READY: ‘గేమ్ ఛేంజర్’ నుంచి మరో సాంగ్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ తెరకెక్కిస్తోన్న ‘గేమ్ ఛేంజర్’ సినిమా నుంచి మరో సాంగ్ రిలీజ్ కానుంది. ‘తర్వాతి సాంగ్ గేమ్ ఛేంజర్‌ను సౌండ్ ఛేంజర్‌గా మారుస్తుంది’ అంటూ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ట్వీట్ చేశారు. దీంతో ఈ సాంగ్‌పై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. DHOP అంటూ సాగే ఈ సాంగ్ సాయంత్రం 6 గంటలకు రిలీజ్ అవుతుందని, ఆ తర్వాత దీని గురించి ప్రపంచమే మాట్లాడుకుంటుందని ఆయన పేర్కొన్నారు.
Similar News
News December 16, 2025
ఇతిహాసాలు క్విజ్ – 98 సమాధానం

ఈరోజు ప్రశ్న: భీముడు ఈ వీరుడితో 27 రోజులు పోరాడతాడు. శ్రీకృష్ణుడి సూచన మేరకు అతని శరీరాన్ని రెండు భాగాలుగా చీల్చి, వేర్వేరు దిక్కులకు పడేస్తాడు. ఈ విధంగా అస్తమించిన మహాభారత పాత్ర ఎవరిది?
సమాధానం: జరాసంధుడు
<<-se>>#Ithihasaluquiz<<>>
News December 16, 2025
చంద్రబాబు ఇచ్చిన DSC నోటిఫికేషన్‌తో టీచర్ అయ్యా: హోంమంత్రి

AP: చంద్రబాబు సీఎంగా ఉన్న ప్రతి ఏడాది డీఎస్సీ, కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తారని హోంమంత్రి అనిత తెలిపారు. ‘చంద్రబాబు 2002లో ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్‌తో నేను టీచర్ అయ్యాను. ఇప్పుడు ఆయన క్యాబినెట్లోనే మంత్రిగా ఉండటం నా అదృష్టం. పోలీసు యూనిఫామ్ పవర్ కాదు.. బాధ్యత. కానిస్టేబుల్ పోస్టుల్లో రికమెండేషన్లు, పొరపాట్లకు తావు లేకుండా టెక్నాలజీని ప్రవేశపెట్టాం’ అని నియామకపత్రాల పంపిణీలో చెప్పారు.
News December 16, 2025
మెస్సీ ఈవెంట్‌తో రాహుల్ మెసేజ్!

వరుస విజయాలు రేవంత్ రెడ్డికి జోష్, పుష్ ఇస్తున్నాయని తాజా పరిణామాలు చెబుతున్నాయి. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ను గెలిపించడంతో సమీకరణాలు మారిపోయాయి. కొన్ని నెలల క్రితం పొసగని, హైకమాండ్ వద్ద పొగబెట్టిన నేతలు సైతం ఇప్పుడు కామ్ అయ్యారు. ఇక HYDలో మెస్సీ ఈవెంట్‌కు రాహుల్ హాజరై CM వైపే ఉన్నానని మెసేజ్ ఇచ్చారు. ఈ జోష్, పుష్తో పార్టీలో, ప్రభుత్వంలో రేవంత్ మరింత స్వతంత్రంగా పనిచేసే అవకాశముంది.


