News December 1, 2024
GET READY: 6.03PMకు ‘పుష్ప-2’ నుంచి మరో సాంగ్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన ‘పుష్ప-2’ సినిమా నుంచి మరో సాంగ్ రిలీజ్ కానుంది. ఈరోజు సాయంత్రం 6.03 గంటలకు ‘పీలింగ్స్’ సాంగ్ విడుదల అవుతుందని మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈనెల 5న ‘పుష్ప-2’ రిలీజ్ కానుండగా రేపు యూసుఫ్‌గూడ గ్రౌండ్స్‌లో భారీ ఈవెంట్ జరగనుంది. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు.
Similar News
News December 14, 2025
భారత్‌లోనూ ఉగ్ర దాడులకు కుట్ర?

ఆస్ట్రేలియాలో <<18562319>>కాల్పుల<<>> నేపథ్యంతో భారత్‌లో భద్రతా బలగాలు హై అలర్ట్ ప్రకటించాయి. ఢిల్లీ, ముంబై, ఇతర ప్రధాన నగరాల్లో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఈ మేరకు టెర్రర్ గ్రూపులు కుట్ర చేస్తున్నట్లు తెలిపాయి. హనుక్కా పండుగ సందర్భంగా యూదుల ప్రార్థనా మందిరాలు, కమ్యూనిటీ సెంటర్లను టార్గెట్‌గా చేసుకున్నట్లు పేర్కొన్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో భద్రతను పెంచారు.
News December 14, 2025
సర్పంచ్ రిజల్ట్స్: ఉత్తర తెలంగాణలో బీజేపీ సత్తా

TG: ఉత్తర తెలంగాణలో బీజేపీ సత్తా చాటుతోంది. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో BRS కంటే ఎక్కువ సీట్లు కమలం పార్టీ మద్దతుదారులే సొంతం చేసుకున్నారు. నిర్మల్ జిల్లాలో కాంగ్రెస్ కంటే ఎక్కువ స్థానాలు గెలుచుకోవడం విశేషం. కాగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 4 ఎమ్మెల్యే సీట్లు గెలిచిన సంగతి తెలిసిందే.
News December 14, 2025
సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్య.. తీరా రిజల్ట్ చూస్తే..

TG: సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మం. పీపడ్పల్లి సర్పంచ్ అభ్యర్థి చాల్కి రాజు (35) ఈ నెల 8న ఆత్మహత్య చేసుకున్నాడు. కాంగ్రెస్ మద్దతుతో సర్పంచ్ బరిలో దిగిన ఆయన.. ప్రచారానికి డబ్బులు లేకపోవడం, పోటీకి ప్రోత్సహించిన వారు మౌనంగా ఉండటంతో అయ్యప్ప మాలలో ఉండగానే ఉరేసుకున్నాడు. అయితే ఇవాళ్టి ఫలితాల్లో రాజు 8 ఓట్ల తేడాతో ప్రత్యర్థిపై విజయం సాధించారు. దీంతో ఆ గ్రామంలో మరోసారి ఎన్నికలు నిర్వహించనున్నారు.


