News November 11, 2024

GET READY: 4.05కు ‘పుష్ప-2’ నుంచి బిగ్ అప్డేట్

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తోన్న ‘పుష్ప-2’ నుంచి బిగ్గెస్ట్ అనౌన్స్‌మెంట్ రానుంది. ఈరోజు సాయంత్రం 4.05 గంటలకు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తోన్న అప్డేట్ ఇవ్వనున్నట్లు మేకర్స్ ట్వీట్ చేశారు. దీంతో ఈ చిత్ర ట్రైలర్‌ రిలీజ్ తేదీని ప్రకటించే అవకాశం ఉందని సినీవర్గాలు పేర్కొంటున్నాయి. రిలీజ్ లోపు రెండు ట్రైలర్లను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెల 5న ‘పుష్ప-2’ రిలీజ్ కానుంది.

Similar News

News January 4, 2026

జనవరి 4: చరిత్రలో ఈరోజు

image

* 1643: శాస్త్రవేత్త ఐజాక్ న్యూటన్(ఫొటోలో లెఫ్ట్) జననం
* 1809: బ్రెయిలీ లిపి సృష్టికర్త లూయీ బ్రెయిలీ జననం
* 1889: భారతదేశ రెండవ ప్రధాన న్యాయమూర్తి ఎం.పతంజలి శాస్త్రి జననం
* 1945: నటుడు, దర్శకుడు ఎస్.కె.మిశ్రో జననం
* 1994: సంగీత దర్శకుడు రాహుల్ దేవ్ బర్మన్ మరణం
* 2015: నటుడు ఆహుతి ప్రసాద్ మరణం
– ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం

News January 4, 2026

వెనిజులాలోని భారతీయులకు MEA హెచ్చరిక

image

వెనిజులాలో నెలకొన్న తాజా పరిణామాల నేపథ్యంలో భారతీయులకు భారత విదేశీ వ్యవహారాల శాఖ హెచ్చరికలు చేసింది. అత్యవసరం కాకపోతే ఆ దేశానికి ప్రయాణాలు మానుకోవాలంది. ఇప్పటికే వెనిజులాలో ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలని, బయట తిరగొద్దని కోరింది. సాయం కావాల్సినవారు cons.caracas@mea.gov.in, అత్యవసర ఫోన్/వాట్సాప్ నంబరు(58-412-9584288)ను సంప్రదించాలంది. భారతీయులందరూ కరాకస్‌లోని ఎంబసీతో టచ్‌లో ఉండాలని విన్నవించింది.

News January 4, 2026

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.