News September 9, 2024
GET READY: రేపు 5.04PMకి ‘దేవర’ ట్రైలర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కించిన ‘దేవర’ సినిమా ట్రైలర్ రేపు సాయంత్రం 5.04 గంటలకు రిలీజ్ కానుంది. ఈ మేరకు చిత్రయూనిట్ స్పెషల్ పోస్టర్ను విడుదల చేసింది. ‘ఆకాశం వణికిపోతోంది. అలలు ఎగసిపడుతున్నాయి. ఇవి అత్యంత ఘోరమైన మారణహోమానికి సంకేతాలు’ అని ట్వీట్ చేసింది. దేవర & వర వస్తున్నారని చెప్పడంతో ట్రైలర్పై మరింత ఆత్రుత పెరిగింది. ఈనెల 27న ‘దేవర’ విడుదలవనుంది.
Similar News
News December 15, 2025
జెలెన్స్కీ కొత్త ప్రతిపాదన

రష్యాతో యుద్ధాన్ని ముగించే విషయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కొత్త ప్రతిపాదన చేశారు. పశ్చిమ దేశాలు భద్రతపై హామీ ఇస్తే NATOలో చేరాలన్న ప్రయత్నాలను విరమించుకోవడానికి రెడీ అని ప్రకటించారు. ‘కూటమి సభ్యులకు లభించే తరహాలో భద్రతా హామీలు ఆశిస్తున్నాం. రష్యా మరోసారి ఆక్రమణకు దిగకుండా నిరోధించేందుకు మాకు ఇదో అవకాశం’ అని చెప్పారు. తమ భూభాగాన్ని రష్యాకు వదులుకోవాలన్న US ప్రతిపాదనను నిరాకరించారు.
News December 15, 2025
ప్రపంచకప్లో వాళ్లే గెలిపిస్తారు: అభిషేక్ శర్మ

తన సహచర క్రికెటర్లు శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్కు అభిషేక్ శర్మ మద్దతుగా నిలిచారు. రానున్న T20 వరల్డ్ కప్లో వాళ్లిద్దరూ మ్యాచ్లు గెలిపిస్తారని అన్నారు. ‘నేను చాలా కాలంగా వారితో కలిసి ఆడుతున్నాను. ముఖ్యంగా గిల్ గురించి నాకు తెలుసు. అతడిపై నాకు మొదటి నుంచీ నమ్మకం ఉంది. అతి త్వరలో అందరూ గిల్ను నమ్ముతారని ఆశిస్తున్నా’ అని చెప్పారు. కాగా ఇటీవల గిల్, సూర్య <<18568094>>వరుసగా<<>> విఫలమవుతున్న విషయం తెలిసిందే.
News December 15, 2025
లోకేశ్ వెళ్తున్న విమానం దారి మళ్లింపు

AP: ఉత్తర భారతంలో దట్టమైన పొగమంచు కారణంగా మంత్రి లోకేశ్ వెళ్తున్న విమానాన్ని దారి మళ్లించారు. ఇవాళ ఉదయం హైదరాబాద్ నుంచి ఆయన ఢిల్లీకి బయల్దేరగా, విమానాన్ని జైపూర్కు పంపారు. పొగమంచు కారణంగా ఢిల్లీలో ఇప్పటిదాకా 40 విమానాలు రద్దయ్యాయి. మరో 4 విమానాలను దారి మళ్లించారు. మరోవైపు విదేశీ పర్యటనకు వెళ్తున్న ప్రధాని మోదీ విమానం <<18569475>>ఆలస్యమైన<<>> విషయం తెలిసిందే.


