News October 8, 2024
దృశ్యం-3కి రంగం సిద్ధం!

జీతూ జోసెఫ్ డైరెక్షన్లో మోహన్ లాల్, మీనా ప్రధాన పాత్రల్లో దృశ్యం-3 మూవీ షూటింగ్ వచ్చే ఏడాది ప్రథమార్థంలో ప్రారంభం కానుంది. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తయినట్లు సమాచారం. 2025 క్రిస్మస్ నాటికి విడుదల చేసేలా మూవీ యూనిట్ ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ‘దృశ్యం’ రెండు భాగాలు దాదాపు అన్ని భాషల్లో రీమేక్ అయిన విషయం తెలిసిందే. తెలుగులో వెంకటేశ్, మీనా నటించారు.
Similar News
News November 25, 2025
సాయంత్రం ఎన్నికల సంఘం ప్రెస్మీట్

TG: రాష్ట్ర ఎన్నికల సంఘం సా.6.15 గంటలకు ప్రెస్మీట్ నిర్వహించనుంది. పంచాయతీ ఎన్నికలపై షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న క్యాబినెట్ భేటీలో ఎన్నికల తేదీలపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. ఈ రోజు షెడ్యూల్ ఇచ్చి ఒకటి, రెండు రోజుల్లో నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం. మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించాలని SEC నిర్ణయించినట్లు తెలుస్తోంది.
News November 25, 2025
500 దాటిన సౌతాఫ్రికా ఆధిక్యం

భారత్తో రెండో టెస్టులో సౌతాఫ్రికా మరింత పట్టు బిగిస్తోంది. ఆ జట్టు ఆధిక్యం 503 పరుగులకు చేరింది. తొలి ఇన్నింగ్స్లో 489 రన్స్ చేసిన సఫారీ జట్టు రెండో ఇన్నింగ్స్లోనూ నిలకడగా ఆడుతోంది. ప్రస్తుతం 4 వికెట్ల నష్టానికి 215 రన్స్ చేసింది. క్రీజులో ఉన్న స్టబ్స్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నారు. అటు వికెట్లు తీసేందుకు భారత బౌలర్లు శ్రమిస్తున్నారు. జడేజా 3 వికెట్లు పడగొట్టారు.
News November 25, 2025
బిహార్ ఓటమి.. ఏడుగురు నేతలపై కాంగ్రెస్ వేటు

బిహార్ ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో ఏడుగురు కాంగ్రెస్ నేతలను పార్టీ నుంచి ఆరేళ్లపాటు బహిష్కరించింది. క్రమశిక్షణ, పార్టీ సంస్థాగత సూత్రాలు, మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు ఈ చర్యలు తీసుకుంది. ఆదిత్య పాశ్వాన్, షకీలుర్ రెహమాన్, రాజ్ కుమార్ శర్మ, రాజ్కుమార్ రాజన్, కుందన్ గుప్తా, కాంచన కుమారి, రవి గోల్డెన్ను పార్టీ నుంచి తొలగిస్తున్నట్టు కాంగ్రెస్ బిహార్ డిసిప్లినరీ కమిటీ చైర్మన్ ఉత్తర్వులిచ్చారు.


