News May 20, 2024
Get Ready: కాసేపట్లో IPL టికెట్లు విడుదల

ఐపీఎల్ సీజన్-17 ఫైనల్ మ్యాచ్ టికెట్లు కాసేపట్లో అందుబాటులోకి రానున్నాయి. సాయంత్రం 6 గంటల నుంచి పేటీఎం ఇన్సైడర్లో వీటిని విక్రయించనున్నారు. రూపే కార్డ్ ఉన్న వారు మాత్రమే వీటిని కొనుగోలు చేయొచ్చు. టికెట్ కనిష్ఠ ధర రూ.3 వేలుగా ఉంది. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఈ నెల 26న ఫైనల్ జరగనుంది.
Similar News
News October 24, 2025
డ్రాయర్ల కంపెనీని వెళ్లగొట్టిన వ్యక్తి డేటా కంపెనీ తెచ్చాడట: సోమిరెడ్డి

AP: విశాఖకు తామే డేటా సెంటర్ తెచ్చామన్న YS జగన్ <<18081370>>కామెంట్లపై<<>> టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సెటైర్లు వేశారు. ‘డ్రాయర్ల కంపెనీని వెళ్లగొట్టిన వ్యక్తి డేటా కంపెనీ తెచ్చాడట. అప్పట్లో కియా తెచ్చింది తన తండ్రేనన్నాడు. ఇప్పుడు గూగుల్ తానే తెచ్చానంటున్నాడు. చెప్పుకోవడానికైనా సిగ్గుండాలి. ఇన్నాళ్లూ సగం పిచ్చోడనుకున్నాం… ఇప్పుడు పూర్తి పిచ్చోడని అర్థమైంది’ అని ట్వీట్ చేశారు.
News October 24, 2025
కార్తీక మాసంలో తినకూడని ఆహారం..

కార్తీక మాసం పరమ పవిత్రమైనది. ఈ మాసంలో ఉపవాస దీక్షతో పాటు కొన్ని ఆహార నియమాలను పాటించాలని పండితులు సూచిస్తున్నారు. ఆధ్యాత్మిక చింతన, దైవారాధనలకు అనుకూలంగా ఉండేలా ఆహారం తీసుకోవాలన్నారు. ‘ఉల్లిపాయ, ఇంగువ, ముల్లంగి, వంకాయ, ఆనపకాయ, మునగకాయ, గుమ్మడికాయ, పుచ్చకాయ, వెలగపండు, చద్దన్నము వంటి వాటిని తీసుకోరాదు. మినుములు, పెసలు, శెనగల, ఉలవలు, కందులు వంటి ధాన్యాలను కూడా ఉపయోగించకూడదు’ అని అంటున్నారు.
News October 24, 2025
అమ్మబోతే అడివి.. కొనబోతే కొరివి

ఇది రైతుల కష్టాల గురించి తెలిపే సామెత. అన్నదాతలు పండించిన పంటను అమ్మాలనుకుంటే కొనేవారు ఎవరూ ఉండరు. లేదా చాలా సందర్భాల్లో గిట్టుబాటు ధర లభించక తక్కువ ధరకే అమ్మాల్సి వస్తుంటుంది. కానీ అదే ధాన్యాన్ని రైతు కొనాలనుకుంటే మాత్రం అధిక ధర చెల్లించాల్సి ఉంటుంది. అందుకే ఈ పరిస్థితిని ‘అమ్మబోతే అడివి.. కొనబోతే కొరివి’గా చెబుతుంటారు. ఈ పరిస్థితి ఇప్పటికీ కొనసాగుతుండటం నిజంగా బాధాకరం.


